రిషికేశ్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రిషికేశ్- కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులోని ప్యాకేజీ-2లో శివపురి, గూలర్ మధ్య ఆరు కిలోమీటర్ల రైలు సొరంగ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యింది. దీనికి సమాంతరంగా వెళ్లే సొరంగ నిర్మాణం 2023 సెప్టెంబరు నాటికే పూర్తయ్యింది.
రిషికేశ్‌లోని కర్ణప్రయాగ్ వరకూ 125 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైనులోని 104 కిలోమీటర్ల ప్రాంతం 17 విభిన్న సొరంగాల మధ్య నుంచి వెళుతుంది. అన్ని సొరంగాల మొత్తం పొడవు 213.4 కిలోమీటర్లు. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టులోని మొత్తం 213.4 కిలోమీటర్లలో ఇప్పటికే 169.496(79.42 శాతం) సొరంగం తవ్వకాల పనులు పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో రైల్వే ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్న లార్సన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) బృందానికి అభినందనలు తెలిపారు.
రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు ఎల్ అండ్ టీ కంపెనీ చేపడుతున్న నేపధ్యంలో తాజాగా కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ రాజేష్ చోప్రా మాట్లాడుతూ ప్యాకేజీ-2లో ఎల్ అండ్ టీ చేతిలో ఎడిట్-2(56 మీటర్లు), మెయిన్ టన్నెల్-2లో డబుల్ లైన్ 7-స్టేజ్(80 మీటర్లు) ముఖ్య సొరంగం(6002) మీటర్లు, నికాస్ సొరంగం(6066 మీటర్లు)నకు సంబంధించిన టన్నలింగ్ పనులు ఉన్నాయన్నారు. వీటిలోని చాలా పనులు 2023 సెప్టెంబరు 12 నాటికే పూర్తయ్యాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment