
ట్రైన్ వస్తున్న సమయంలో రైల్వే ట్రాక్‌ల పైనుంచి రాకపోకలు సాగిస్తున్న విద్యార్ధులు
గజపతినగరం రూరల్ : మండల పరిధిలోని పురిటిపెంట రైల్వే గేట్ వద్ద విద్యార్థులు ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తుండడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న వారే ఇలా చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పురిటిపెంట వద్ద రైల్వే గేట్ ఉంది. రైళ్లు వచ్చేటప్పుడు సిబ్బంది ఠంచన్‌గా గేట్ వేస్తుంటారు. అయితే గేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు గేట్ వేసినా ఆగకుండా ట్రాక్‌పై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.
ప్రతిరోజూ కళాశాలల ప్రారంభ సమయంలో పదుల సంఖ్యలో విద్యార్థులు ట్రాక్‌పై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఒక్కోసారి రెండు ట్రాక్‌లపై కూడా రైళ్లు వస్తుంటాయి. ఆ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరగరాని ప్రమాదం జరిగితే విద్యార్థుల కుటుంబాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కళాశాలల సిబ్బంది అయినా విద్యార్థులకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment