అలర్ట్‌: ఈ రూట్లలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు | South Eastern Railway: Trains Are Canceled Check List Here | Sakshi
Sakshi News home page

అలర్ట్‌: నేడు, రేపు పలు రైళ్ల రద్దు

Published Sun, Jun 18 2023 7:44 AM | Last Updated on Sun, Jun 18 2023 7:46 AM

South Eastern Railway: Trains Are Canceled Check List Here - Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ)/తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలోని ఖరగ్‌పూర్‌–భాద్రక్‌ సెక్షన్‌లో జరుగుతున్న ట్రాక్‌ పునరుద్ధరణ పనుల కారణంగా ఆయా మార్గంలో నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆదివారం షాలీమార్‌–హైదరాబాద్‌ (18045/18046), సత్రగచ్చి–తిరుపతి (228­55), గౌహతి–సికింద్రాబాద్‌ (02605), హౌరా–­పుదుచ్చేరి (12867), చెన్నై సెంట్రల్‌– సత్రగచ్చి (22808), మైసూర్‌–హౌరా (228­18) రైళ్లు రద్దు అయ్యాయి. ఈ నెల 19న తిరుపతి–సత్రగచ్చి (22856), సికింద్రాబాద్‌–అగర్తల (07030), యర్నాకులం–హౌరా (228­78) రైళ్లను రద్దు చేశారు. 

వందేభారత్‌ రీషెడ్యూల్‌ 
విశాఖలో శనివారం ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం– సికింద్రాబాద్‌(20833) వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మధ్యా­హ్నం 2.10 గంటలకు బయల్దేరింది. ఈ రైలు  సికింద్రాబాద్‌ నుంచి శుక్రవారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరాల్సి ఉండగా సుమారు 10 గంటలు ఆలస్యంగా శనివారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంది. అందువల్ల విశాఖ నుంచి సుమారు 8 గంటలు ఆలస్యంగా బయల్దేరింది.

చదవండి: అగ్నివీరులొచ్చేశారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement