
న్యూఢిల్లీ : రాజధాని ఢిల్లీని మంగళవారం పొగమంచు కప్పేయడంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మంగళవారం ఉదయం 9.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో దారి కనిపించక 18 రైళ్లను రద్దు చేశారు. మరో 28 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఢిల్లీలో పాక్షికంగా వాతావరణం మేఘావృతం అయిందని ఇండియన్ మెటరాలాజికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. ఉదయం ఎనిమిదిన్నర సమయానికి గాలిలో తేమ 78 శాతంగా నమోదైందని, అలాగే విసిబిలిటీ 1500 మీటర్లుగా ఉందని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ గరిష్ట ఉష్ణోగ్రతలు 25.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని తెలిపారు.