What Is The Meaning Of The X Mark At End Of All Trains, Explained In Telugu - Sakshi
Sakshi News home page

Meaning Of X Mark On Train End: అన్ని రైళ్లకూ ‘X’ గుర్తు.. ‘వందే భారత్‌’కు ఎందుకు మినహాయింపు?

Published Sun, Jul 16 2023 11:42 AM | Last Updated on Sun, Jul 16 2023 1:02 PM

what is the meaning of the x mark on the train - Sakshi

మనదేశంలోని అన్ని రైళ్ల చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు కనిపిస్తుంది. దీనిని భద్రతా నియమాలను అనుసరిస్తూ రూపొందిస్తారు. ఈ ‘X’ గుర్తు రైలు చివరి బోగీని సూచిస్తుంది. అయితే వందేభారత్‌ రైలు చివరి బోగీకి మాత్రం ఈ ‘X’ గుర్తు కనిపించదు. వందేబారత్‌ ట్రైన్‌.. హై స్పీడ్‌ ట్రైన్‌. ఈ ట్రైన్‌ అంతా అటాచ్డ్‌గా ఉంటుంది. ఈ రైలు రెండు వైపుల నుంచి పరుగులు పెడుతుంది. అందుకే ఈ రైలుకు ‘X’ గుర్తు ఉండదు.

రైల్వే విభాగం పలు భద్రతా చర్యలు చేపడున్న దృష్ట్యా పలు సిగ్నళ్లు, సైన్‌లను  రూపొందించి, ఉపయోగిస్తుంది. ఈ కోవలోనే రైలు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు రూపొందిస్తారు. ఇది రైల్వే అధికారులను, సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తారు. ‘X’ గుర్తు రైలు చివరి బోగీని సూచిస్తుంది. 

రైలు ఏదైనా స్టేషన్‌ మీదుగా వెళ్లినప్పుడు రైల్వే సిబ్బంది ఆ రైలు చివరి బోగీపై ఉన్న ‘X’ గుర్తును చూస్తారు. దానిని గమనించాక ఆ రైలుకు అది చివరి బోగీ అని స్పష్టం చేసుకుంటారు. ఒకవేళ ‘X’ గుర్తు అనేది లేకపోతే.. ఆ రైలుకు వెనుకవైపు గల బోగీలు రైలు నుంచి విడిపోయాయని అర్థం. ఇలా జరిగితే వెంటనే రైల్వే సిబ్బంది కంట్రోల్‌ రూమ్‌కు పోన్‌ చేసి, ఆ రైలుకు గల వెనుక బోగీలు ఎక్కడో విడిపోయాయనే సమాచారాన్ని అందిస్తారు. అందుకే ఏ రైలుకైనా చివరి బోగీ వెనక ‘X’ గుర్తు ఉండటం ఎంతో ముఖ్య విషయమని రైల్వే సిబ్బంది భావిస్తారు. 

వందేభారత్‌ విషయానికొస్తే దీనికి ‘రైల్వే సురక్షా కవచ్‌’ అనే ప్రత్యేక ఫీచర్‌ ఉంది. ఈ ఫీచర్‌ అనుకోని విపత్తుల నుంచి ప్రయాణికులను రక్షిస్తుంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్పీడు అధికారికంగా గంటకు 160 కిలోమీటర్లు. ఈ ఎక్స్‌ప్రెస్‌కు ఇంటెలిజంట్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ కూడా ఉంది. 
ఇది కూడా చదవండి: యువకుని ప్రాణాలు తీసిన మూమూస్‌ ఈటింగ్‌ ఛాలెంజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement