కోల్కతాలో భారీ అగ్నిప్రమాదం | Fire Breaks out In Building At Kolkata's IT Hub In Salt Lake | Sakshi
Sakshi News home page

కోల్కతాలో భారీ అగ్నిప్రమాదం

Published Wed, Dec 9 2015 10:00 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire Breaks out In Building At Kolkata's IT Hub In Salt Lake

కోల్కతా : కోల్కతాలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఓ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఇన్ఫినిటీ బెంచ్‌మార్క్ కార్యాలయంలో ఆరో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఉదయం 7.30 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కాగా కిచెన్లో మంటలు చెలరేగడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఎంతమేరకు ఆస్తి నష్టం జరిగిందనే దానిపై సమాచారం లేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement