
కోల్‌కతా: నగరంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్టుమెంట్‌లోని 17వ అంతస్తులో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. 17వ అంతస్తులో సంభవించిన మంటలు మెల్లగా 18, 19వ అంతస్తులకు వ్యాపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే మంటలు ఇంకా అదుపులోకి రాలేదని, అదృష్టవశాత్తు ఈ మంటల్లో ఎవరూ చిక్కుకోలేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు. అలాగే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment