
ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా: కోల్‌కతాలోని ప్రముఖ కార్ల కంపెనీలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆనందపురాలోని కార్ల కంపెనీకి చెందిన వర్క్‌షాపులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పలు కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. అనేక వాహనాలను ప్రమాదస్థలంనుంచి పక్కకు తప్పించారు. 10 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి వుంది.
మరోవైపు తూర్పు కోల్‌కతాలోని ఆనందపూర్ ప్రాంతంలో ఉన్న వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయని, శీతలీకరణ ప్రక్రియ ప్రారంభమైందని అగ్నిమాపక, అత్యవసర సేవల మంత్రి సుజిత్ బోస్ తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment