ప్రకృతి అద్భుతాల్లో ఒకటి.. మహర్లూ సరస్సు. దక్షిణ ఇరాన్ లోని షిరాజ్ నగరానికి సమీపంలో దాదాపు 600 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందీ ఉప్పు నీటి సరస్సు. ఓ పక్క తెలుపు, మరో పక్క లేత గులాబీ రంగుతో.. సందర్శకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఎత్తైన ప్రాంతంలో కొలువుదీరిన ఈ కొలను కాలానుగుణంగా తన రంగును మార్చుకుంటుంది.
షిరాజ్‌కు ఆగ్నేయంగా 27.0 కిమీల (16.8 మైళ్ళు) వరకూ ప్రవహిస్తుంది. సాధారణంగా వేసవి చివరి నాటికి ఆవిరైపోతుంది. ఆ సమయంలోనే ఇది పింక్ కలర్‌లోకి మారి.. ప్రకృతి ప్రియుల్ని ఆకర్షిస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా ఇది పింక్ కలర్‌లోకి మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. నీటి మట్టం మరింత తగ్గగానే ముదురు గులాబీ రంగులోకి మారుతుంది. ఇందులో పేరుకున్న ఉప్పే.. ఈ సరస్సు మధ్యలో లేదా తీరంలో నిలబడటానికి.. దిమ్మలా, ఒడ్డులా మారుతుంది.
ఇలాంటి పింక్ సరస్సులు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఉన్నాయి. రష్యాలోని ఆల్టై పర్వత ప్రాంతంలో ఉన్న సైబీరియన్ పింక్ లేక్ కూడా గతంలో వైరల్ అయ్యింది. ఆ సరస్సు మధ్యలోంచి రైలు పట్టాలు వేయడంతో సందర్శకులను అది మరింత ఆకట్టుకుంటోంది. ‘ఆర్టెమియా సాలినా’ అనే ఉప్పు నీటి రొయ్యల జాతి కారణంగానే ఆగస్ట్ సమయంలో.. సైబీరియన్ సరస్సుకి గులాబీ రంగు వస్తుందని నిపుణులు తేల్చారు.
ఇవి చదవండి: అవును.. అది నిజంగా మృత్యుగుహే!
Comments
Please login to add a commentAdd a comment