ఐదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి తిరిగొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని భర్య, బావమరిది హత్యచేశారనే అనుమానంతో కోర్టులో కేసు కూడా ఫైల్ అయ్యింది. ఇంతలో చనిపోయిన వ్యక్తి తిరిగిరావడంతో అందరూ షాక్!! అసలేంజరిగిందంటే..
బీహార్‌లోని కఠారీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 5 యేళ్ల క్రితం హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. సదరు వ్యక్తి సోదరుడు ఎంతవెతికినా ప్రయోజనం లేకపోయింది. సోదరుడిని అతని భార్య, బావమరిది హత్య చేశారనే అనుమానంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. ఐతే పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో 2016లో తన సోదరుడు హత్య చేయబడ్డాడని, భార్య,బావమరిది హత్యచేశారనే నెపంతో కోర్టులో కేసు ఫైల్ చేశాడు.
కోర్టులో కేసు నడుస్తుండగా చనిపోయాడనుకుంటున్న సదరు వ్యక్తి సొంతూరుకు వచ్చాడు. గుజరాత్‌లోని ఒక నూలు పరిశ్రమలో పనిచేసేవాడని, ఇంటికి తిరిగొస్తూ ఉండగా ఒక పెద్ద ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్లానని, ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ ప్రమాదంలో గత జ్ఞాపకాలు చాలామటుకు మరచిపోయానని తెలియజేశాడు. దీంతో ఈ హత్య మిస్టరీ వీడింది. ఈ అరుదైన సంఘటన తాజాగా వెలుగుచూసింది.
చదవండి: Wonder of Science: బాప్‌రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!!
Comments
Please login to add a commentAdd a comment