42 ఏళ్లుగా మృత్యువుతో పోరాడుతున్న నర్సు
ముంబై: నాలుగ దశాబ్దాల క్రితం ఓ మహిళపై జరిగిన అత్యాచార ఘటన ఆమె జీవితంలో తీవ్ర అలజడిని రేకెత్తించింది. నర్సుగా విధులు నిర్వహించడమే ఆ మహిళకు శాపంగా మారింది. ఆస్పత్రిలో రోగులకు సేవ చేయాల్సిన ఆమె.. అదే ఆస్పత్రి బెడ్ పై నిర్జీవంగా పడి ఉంది. గత 42 ఏళ్లుకు ఆమెది ఇదే పరిస్థితి. ఇంతటి దీన పరిస్థితి కారణం ఆమెపై అప్పట్లో జరిగిన అత్యాచారం. వివరాల్లోకి వెళితే.. అరుణా షాన్ బాగ్(68) అనే మహిళ సరిగ్గా 26 ఏళ్లప్పుడు అత్యాచారానికి గురైంది. ముంబైలోని కేవీఎమ్ ఆస్పత్రిలో షాన్ బాగ్ నర్సుగా విధులు నిర్వహించే సమయంలోవార్డ్ బాయ్ సోహన్ లాల్ వాల్మికి ఆమెపై అతి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్డాడు. దీంతో షాక్ తిన్న ఆమె ఆపై కోమాలోకి వెళ్లిపోయింది. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఆమె అదే స్థితిలో కొనసాగుతోంది.
ప్రస్తుతం కేవీఎమ్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా అంతటి దయనీయ స్థితిలో ఉన్న ఆమెను మందుల ద్వారానే ప్రాణాన్ని తీయాలనే వాదన కూడా వినిపిస్తోంది. దీన్ని కేవీఎమ్ ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది.