Aruna Shanbaug
-
కోల్కత్తా డాక్టర్ కేసు విచారణ.. ‘1973’ భయంకర ఘటనను గుర్తు చేసిన సీజే
ఢిల్లీ: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ 1973 అరుణా షాన్‌బాగ్ సంఘటనను ప్రస్తావించారు. పని ప్రదేశాల్లో మహిళల సంఖ్య పెరుగుతుందని.. వివక్ష కారణంగా మహిళా డాక్టర్లను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరో అత్యాచార ఘటన జరిగే వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదని, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అరుణా షాన్‌బాగ్‌కు జరిగిన అన్యాయం, వైద్య రంగంలోనే ఘోరమైన ఘటన అని సీజే తన తీర్పు సమయంలో గుర్తు చేశారు.42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా..1967లో అరుణా షాన్‌బాగ్ కేఈఎం ఆస్పత్రిలో సర్జరీ డిపార్ట్మెంట్లో చేరారు. డాక్టర్ సుందీప్ సర్దేశాయి వద్ద ఆమె పనిచేశారు. 1974లో ఆమె ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ 1973, నవంబర్ 27వ తేదీన ఆమెపై వార్డు అటెండెంట్ పైశాచికంగా దాడి చేశాడు. లైంగికంగా దాడి చేసి, ఆమెను తాడుతో కట్టేశాడు. దీంతో ఆమె మెదడుకు తీవ్రమైన గాయమైంది. 42 ఏళ్ల పాటు ఆమె అచేతన స్థితి(కోమా)లో ఉండిపోయింది. 2015లో ఆమె తుది శ్వాస విడిచింది.ఆమె జీవితంలో చీకటి నింపిన ఆరోజు:కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హల్దీపూర్కు చెందిన అరుణ షాన్‌బాగ్‌కు అప్పుడు 25 ఏళ్లు. రోగులకు సేవ చేసే నర్సింగ్ వృత్తి అంటే ఇష్టం. ఆ మక్కువే ఆమెను ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్(కేఈఎంహెచ్) వైపు నడిపింది. నర్సుగా జీవితాన్ని ప్రారంభించింది. ఎప్పుడూ ఉత్సాహంగా, అందరితో కలివిడిగా ఉండే ఈమెపై అదే ఆసుపత్రిలో వార్డుబాయ్‌గా పనిచేసే సోహన్‌లాల్ భార్తా వాల్మీకి అనే దుర్మార్గుడి కన్ను పడింది. 1973, నవంబర్ 27 రాత్రి ఎప్పట్లాగే అరుణ విధులు ముగించుకుంది.రూమ్‌కి వెళ్లేందుకు బేస్మెంట్లోని ఓ గదిలో బట్టలు మార్చుకుంటోంది. ఇదే సమయంలో సోహన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో కుక్కల్ని కట్టేసే గొలుసును ఆమె గొంతుకు బిగించాడు. పశువులా ప్రవర్తించి పారిపోయాడు. అతడి దాడితో మెడ నుంచి మెదడుకు వెళ్లే నాడులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అరుణ అక్కడికక్కడే కుప్పకూలింది. కోమాలోకి వెళ్లిపోయింది. వెన్నెముక కూడా దెబ్బతింది. అప్పట్నుంచి అచేతనంగానే ఉండిపోయింది.కామాంధుడికి ఏడేళ్ల శిక్షతో సరి..సోహన్‌లాల్ పోలీసులకు చిక్కాడు. దోషిగా తేలాడు. కానీ అత్యాచారం కేసు కింద అతడిని శిక్షించలేదు. ఈ హేయమైన రాక్షస క్రీడను న్యాయస్థానం దొంగతనం, దాడిగానే చూసింది. ఒక్కో కేసు(దొంగతనం, దాడి)లో ఏడేళ్ల శిక్ష విధించాయి. ఆ శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పు చెప్పడంతో కేవలం ఏడేళ్ల శిక్ష అనుభవించి సోహన్‌లాల్ బయటకొచ్చాడు. అరుణ కేసు.. న్యాయ చరిత్రలో ఓ మైలురాయి!ఒంటి నిండా పుండ్లు, కదల్లేని అవయవాలతో కేఈఎం ఆసుపత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లోని వార్డు నంబర్ 4లో బెడ్‌పై ఏళ్లుగా అరుణ అనుభవిస్తున్న బాధ ఎందరినో కలచివేసింది. వారిలో ఆమె స్నేహితురాలు, జర్నలిస్టు పింకి విరానీ ఒకరు. సంవత్సరాల తరబడి పడుతున్న బాధ నుంచి విముక్తి చేస్తూ అరుణను కారుణ్య మరణం కింద చంపేసేందుకు అనుమతించాలంటూ ఆమె 2011లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇది అప్పట్లో కారుణ్య మరణంపై దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది.వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. అరుణ పరిస్థితి తెలుసుకునేందుకు వైద్య నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం అదే ఏడాది మార్చి 7న కోర్టు చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. విరానీ పిటిషన్‌ను తోసిపుచ్చినా.. కారుణ్య నియామకానికి పాక్షిక చట్టబద్ధత కల్పించింది. నయం కాని రోగంతో శాశ్వత అచేతన స్థితి (పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్) ఉన్న రోగులను చట్టపరమైన విధివిధానాలకు లోబడి ప్రాణరక్షక వ్యవస్థలను ఉద్దేశపూర్వకంగా తొలగించి, వారి మరణాన్ని వేగవంతం చేసే పరోక్ష కారుణ్య మరణానికి సానుకూలత ప్రకటించింది. తర్వాత కాలంలో అరుణ కన్నీటి జీవితంపై విరానీ ‘అరుణ స్టోరీ’ అనే పుస్తకం రాశారు. దత్తకుమార్ దేశాయ్ అనే మరాఠా రచయిత ‘కథ అరునాంచి’ అనే నాటకం రాశారు. ఈ నాటకం మహారాష్ట్రలో పలు చోట్ల ప్రదర్శితమైంది కూడా. -
ఇక అరుణ పేరిట అవార్డు
భోపాల్: 42 ఏళ్ల పాటు జీవచ్ఛవంలా బతికి, కన్నుమూసిన అరుణా షాన్ బాగ్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గొప్ప నివాళి అర్పించింది. ఆమె పేరిట గొప్ప అవార్డును ప్రకటించింది. ఇక మహిళలపై దోపిడికి వ్యతిరేకంగా పోరాడే ఏ స్వచ్ఛంద సంస్థకై ప్రతి యేటా అరుణా షాన్ బాగ్ పేరిట రూ.లక్షతో అవార్డు ఇస్తామని చెప్పింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అరుణకు ఘన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె జీవితంలో జరిగిన ఘటన అత్యంత బాధాకరమని చెప్పారు. గౌరవానికి అరుణ చిహ్నం అని అభివర్ణించారు. చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన తరుణం వచ్చిందని చెప్పారు. సమాజంలో మహిళలపట్ల ఆలోచన ధోరణి మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రేమించిన డాక్టరు సందీప్‌ను పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో హాయిగా ఉండాల్సిన అరుణ, ఓ దుర్మార్గుడి దురాగతంతో అచేతనంగా మారిపోయింది. దాదాపు 42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా బతికి చివరకు ప్రాణాలు విడిచింది. -
అరుణ ఊపిరి ఆగిపోయింది..
-
అరుణ ఊపిరి ఆగిపోయింది..
ముంబై : గత 42 ఏళ్లుగా కోమాలో ఉన్న అరుణా షాన్ బాగ్ (68) ఎట్టకేలకు తుదిశ్వాస విడిచింది. ముంబైలోని కింగ్ అడ్వర్డ్స్ మెమోరియల్ (కెఇఎమ్) ఆస్పత్రిలో ఆమె సోమవారం మృతి చెందినట్లు ఆస్పత్రి డీన్ అవినాష్ సుపే వెల్లడించారు. 26 ఏళ్ల వయసులో అరుణా షాన్ బాగ్ ఆసుపత్రిలో నర్సుగా చేస్తుండగా అత్యాచారానికి గురైంది. విధి నిర్వహణలో ఉన్న ఆమెపై ఆస్పత్రి వార్డ్బాయ్ సోహన్ లాల్ వాల్మీకి అతి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టి, తీవ్రంగా గాయపరిచాడు. దాంతో షాక్ తిన్న అరుణా షాన్ బాగ్ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె కోమాలోనే ఉంది. ఆస్పత్రిలో మందులను దొడ్డిదారిన అమ్ముకుంటున్న సోహన్ లాల్‌ను అరుణ ప్రశ్నించటంతో పాటు అధికారుల దృష్టికి తీసుకు వెళతానని హెచ్చిరించడంతో ఆమె అత్యాచారానికి గురైంది. ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను నిర్బంధించిన వార్డు బాయ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. దాంతో మెదడు పని చేయక పోవటంతో కోమాలోకి జారుకుంది. అప్పటి నుంచి కెఇఎమ్ ఆసుపత్రిలోనే అరుణా షాన్ బాగ్ జీవచ్ఛవంగా బతుకుతోంది. ఈ నేపథ్యంలో అరుణకు కారుణ్య మరణాన్ని అర్ధిస్తూ ఆమెపై పుస్తకం రాసిన రచయిత్రి పింకీ విరానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే అరుణా షాన్ బాగ్ సహజ మరణం ఆసన్నమయ్యేవరకూ కంటికి రెప్పలా చూసుకుంటామని ఆసుపత్రి సిబ్బంది హామీ ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఆమెకు కారుణ్య మరణాన్ని నిరాకరించింది. -
42 ఏళ్లుగా మృత్యువుతో పోరాడుతున్న నర్సు
ముంబై: నాలుగ దశాబ్దాల క్రితం ఓ మహిళపై జరిగిన అత్యాచార ఘటన ఆమె జీవితంలో తీవ్ర అలజడిని రేకెత్తించింది. నర్సుగా విధులు నిర్వహించడమే ఆ మహిళకు శాపంగా మారింది. ఆస్పత్రిలో రోగులకు సేవ చేయాల్సిన ఆమె.. అదే ఆస్పత్రి బెడ్ పై నిర్జీవంగా పడి ఉంది. గత 42 ఏళ్లుకు ఆమెది ఇదే పరిస్థితి. ఇంతటి దీన పరిస్థితి కారణం ఆమెపై అప్పట్లో జరిగిన అత్యాచారం. వివరాల్లోకి వెళితే.. అరుణా షాన్ బాగ్(68) అనే మహిళ సరిగ్గా 26 ఏళ్లప్పుడు అత్యాచారానికి గురైంది. ముంబైలోని కేవీఎమ్ ఆస్పత్రిలో షాన్ బాగ్ నర్సుగా విధులు నిర్వహించే సమయంలోవార్డ్ బాయ్ సోహన్ లాల్ వాల్మికి ఆమెపై అతి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్డాడు. దీంతో షాక్ తిన్న ఆమె ఆపై కోమాలోకి వెళ్లిపోయింది. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఆమె అదే స్థితిలో కొనసాగుతోంది. ప్రస్తుతం కేవీఎమ్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా అంతటి దయనీయ స్థితిలో ఉన్న ఆమెను మందుల ద్వారానే ప్రాణాన్ని తీయాలనే వాదన కూడా వినిపిస్తోంది. దీన్ని కేవీఎమ్ ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది.