వరుడి వేడుకతో.. కోమాలోకి వెళ్లిన వధువు | Chinese Bride in Coma After she Fell on Her Head at Wedding | Sakshi
Sakshi News home page

వరుడి వేడుకతో.. కోమాలోకి వెళ్లిన వధువు

Published Tue, Nov 3 2015 4:22 PM | Last Updated on Mon, Aug 13 2018 3:32 PM

వరుడి వేడుకతో.. కోమాలోకి వెళ్లిన వధువు - Sakshi

వరుడి వేడుకతో.. కోమాలోకి వెళ్లిన వధువు

జోజుహాంగ్: పెళ్లి వేడుకలో సరదా కోసం చేసిన విన్యాసం కాస్తా విషాదంగా మారింది. ఈ సంఘటన చైనాలోని జోజుహాంగ్లో చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన వరుడి తరఫు బంధువులు అమ్మాయిని గాల్లోకి ఎగిరేసి.. పట్టుకోవాలని కోరారు. దీంతో వివాహ విందు కార్యక్రమానికి వచ్చిన వధువును హోటల్ గేట్ దగ్గరికి వెళ్లి వరుడు ఆహ్వానించాడు. అప్పుడే ఆమెని ఎత్తుకొని గాల్లోకి విసిరి పట్టుకోవడానికి ప్రయత్నించాడు.

కానీ గాల్లో నుంచి కిందికి వచ్చే సమయంలో వరుడు పట్టుకోవడంలో విఫలం అవ్వడంతో ఆ అమ్మాయి కింద పడింది. తల కిందులుగా పడటంతో మెదడుకు బలమైన గాయమైంది. దీంతో కోమాలోకి వెళ్లిపోయింది. పెళ్లి దుస్తుల్లోనే ఉన్న ఆ అమ్మాయిని  వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement