షుమాకర్ మెడికల్ రిపోర్టులు చోరి
షుమాకర్ మెడికల్ రిపోర్టులు చోరి
Published Tue, Jun 24 2014 11:38 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
జెనీవా: ఫార్మూలా వన్ స్టార్ మైఖేల్ షూమాకర్ మెడికల్ రిపోర్టులు చోరికి గురైన సంఘటన జెనీవాలో సంచలనం రేపుతోంది. గత డిసెంబర్ లో ఫ్రాన్స్‌లోని మెరిబెల్‌లో 45 ఏళ్ల షుమాకర్ స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
కోమాకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు చోరికి గురయ్యాయని షుమాకర్ మేనేజర్ తెలిపారు. చోరికి గురైన డాక్యుమెంట్లను గత కొద్దిరోజులుగా వేలానికి పెట్టారు. షూమాకర్ కు సంబంధించిన మెడికల్ రిపోర్టులని వేలానికి పెట్టిన వ్యక్తి క్లెయిమ్ చేస్తున్నాడు.
అయితే వేలానికి పెట్టిన మెడికల్ రిపోర్టులు నిజమైనవా లేదా అనే విషయంపై సందేహాలున్నాయాన్నారు. మెడికల్ రిపోర్టులు చోరికి గురైన విషయం వాస్తవమేనని జర్మనీ కి చెందిన అధికారి సబైన్ కెమ్ ఓ ప్రకటనలో తెలిపారు. మెడికల్ రిపోర్టులు పూర్తిగా వ్యక్తిగతమైనవి.
పబ్లిక్ కు అందుబాటులో ఉండకూడనివి. అలాంటి వాటిని ఎవరూ కొనుగోళు చేయకూడదు అని హెచ్చరించారు.
Follow @sakshinewsAdvertisement