కొద్దికొద్దిగా స్పృహలోకి వస్తున్న షుమాకర్ | Schumacher shows signs of waking up | Sakshi
Sakshi News home page

కొద్దికొద్దిగా స్పృహలోకి వస్తున్న షుమాకర్

Published Fri, Apr 4 2014 4:49 PM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

కొద్దికొద్దిగా స్పృహలోకి వస్తున్న షుమాకర్

కొద్దికొద్దిగా స్పృహలోకి వస్తున్న షుమాకర్


స్కీయింగ్ ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన ఫార్ములా వన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ మైకెల్ షుమాకర్ అప్పుడప్పుడు కోమా నుంచి బయటకి వస్తున్నారు. ఈ మేరకు షుమాకర్ పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తోంది.


'ఆయన కళ్లు తెరిచి చూస్తున్నారు. కొద్దిగా కదులుతున్నారు' అని ఆయన మేనేజర్ సబీన్ కెహ్మ్ చెప్పారు. గత డిసెంబర్ 29 న ఒక ఫ్రెంచి రిసార్టులో స్కీయింగ్ కోసం వెళ్లిన షుమాకర్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వైద్యులు ఆయన్ను కృత్రిమంగా కోమాలోకి పంపించారు.


ఫార్ములా వన్ రేసింగ్ లో ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ గా గెలిచిన షుమాకర్ అప్పట్నుంచీ కోమాలోనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన పరిస్థితి కాస్త మెరుగుపడిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు గ్రెనోబుల్ హాస్పిటల్ లో చికిత్స జరుగుతోంది. అయితే షుమాకర్ పరిస్థితికి సంబంధించిన అదనపు వివరాలు ఇవ్వడానికి ఆయన మేనేజర్ నిరాకరించారు. షుమాకర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రైవసీని కాపాడేందుకే ఇలా చేస్తున్నామని ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement