
సాక్షి, సిటీబ్యూరో: ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన తన భర్త ఆపరేషన్‌కు ఆర్థిక చేయూత అందించి ఆదుకోవాలని భార్య స్వరూపరాణి, కుమారుడు వికాస్ దాతలను వేడుకుంటున్నారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన జూలూరు శ్రీనివాస్‌కు యాక్సిడెంట్‌లో తలకు బలమైన గాయమై మెదడుపై ప్రభావం చూపింది. నిరుపేద కుటుంబం అప్పు చేయడంతోపాటు కొందరు దాతలు సాయం చేయడంతో సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించారు. మరో ఆపరేషన్ అవసరమని వైద్యులు పేర్కొంటున్నారు. దీనికి సుమారు రూ.3 లక్షలకు పైగా ఖర్చవుతుంది. దాతలు ఆదుకోవాలని బాధితుడి భార్య, కుమారుడు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్: 96034 19501 గూగుల్ పే ద్వారా తోచిన సాయం చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment