నాంపల్లి: కన్నకొడుకు కాలేయ సమస్యతో మంచంపట్టడంతో తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చి పునర్జన్మనిచ్చింది ఓ తల్లి. ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రుల వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి ఆ బాలుడికి కాలేయ మార్పిడి చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండ వనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చౌహాన్ ఆదిత్య(03) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయసమస్యతో బాధపడుతున్నాడు.
దీంతో బాలుడిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలేయ మార్పిడి కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, కాలేయమారి్పడి బృందం, నిలోఫర్ వైద్యు లు కలిసి ఈ నెల 3న ఆదిత్యకు కాలేయమారి్పడి చికిత్సను విజయవంతం చేశారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నారు. వారిని మంగళవారం ఓజీహెచ్ నుంచి డిశ్చార్జి చేశారు. ఇదే శస్త్రచికిత్స కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించి ఉంటే రూ.30 లక్షలు అయ్యేవని, కూలిపని చేసుకుని జీవించే తమ జీవితాల్లో ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రి వైద్యులకు వెలుగులు నింపారంటూ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment