నాలుగు నెలలుగా కోమాలోనే కేంద్ర మాజీమంత్రి
తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్.. నాలుగు నెలలుగా కోమాలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని వైద్యులు చెబుతున్నారు. జస్వంత్ ఆరోగ్యం అలాగే ఉందని, ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనను ప్రతిరోజూ వైద్యుల బృందం ప్రతిరోజూ నిశితంగా పరిశీలిస్తోందన్నారు.
న్యూరోసర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు ఆయనను చూస్తున్నారని, జస్వంత్ సింగ్ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఆయన ప్రస్తుతం టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ మీద ఆధారపడ్డారు. 76 ఏళ్ల జస్వంత్ సింగ్.. ఆగస్టు 8వ తేదీన తమ ఇంట్లో స్పృహలేని పరిస్థితిలో నేలమీద పడి ఉండగా కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.