ఇది సోషల్ మీడియాలో అత్యంత వేగంగా వైరల్ అవుతున్న వీడియో. ఒక చిన్నపిల్లోడు తన తల్లితోపాటు ఆగకుండా రోదిస్తున్న దృశ్యం దీనిలో కనిపిస్తుంది. దీనిని చూసినవారంతా కంటతడి పెట్టుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక తల్లి తన కుమారుడిని కలుసుకునేందుకు ఆసుపత్రికి వస్తుంటుంది. 16 రోజుల పాటు కోమాలో ఉన్న తన కుమారుడు ఇప్పడే మేలుకున్నాడని అమెకు తెలియడంతో పరుగుపరుగున వచ్చింది. పిల్లాడిని కావలించుకుని రోదించింది. ఆ పిల్లాడి పేరు గుడ్. ఆ పిల్లాడు పుట్టుకతోనే డిస్ట్రోఫిక్ ఎపిడెర్మోలిసిస్ అనే అరుదైన చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.
ఈ వ్యాధి కారణంగా పిల్లాడు 16 రోజుల పాటు కోమాలోకి జారుకున్నాడు. కోమా నుంచి మేల్కొన్న తరువాత ముందుగా తల్లిని చూడాలని పరితపించాడు. వారిద్దరూ ఒకరిని ఒకరు హత్తుకుని ఆగకుండా కన్నీరు కారుస్తూనే ఉన్నారు. పిల్లాడు కోమా నుంచి లేచాడని తెలియగానే, ఆ తల్లి పరుగుపరుగున ఆసుపత్రికి చేరుకుంది. పిల్లాడిని చూడగానే తల్లి... అమ్మను చూడగానే పిల్లాడు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
బాధితులను అనుక్షణం కనిపెట్టుకోవాలి..
ఈ పోస్టు క్యాప్షన్‌లో..‘ పిల్లాడు పుట్టుకతోనే డిస్ట్రోఫిక్ ఎపిడెర్మోలిసిస్ బులోసా అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ స్థితి టైప్-VII కొలోజన్ లేమి కారణంగా తలెత్తుతుంది. ఇది ఒక ప్రొటీన్. ఇది చర్మంలోని ఎపిడర్మిస్‌ను అనుసంధానిస్తుంది. దీనిని బైండింగ్ ప్రొటీన్ అని అంటారు. ఇటువంటి స్థితిలోఉన్న గుడ్‌ను అతని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. గుడ్‌కు ఏ చిన్న దెబ్బ తగిలినా, చర్మానికి ఎంటవంటి ఇబ్బంది కలిగినా వ్యాధి మరింత తీవ్ర మవుతుంది. తాజాగా గుడ్ 16 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. దీనిలో 14 రోజులు ఇంట్యుబేషన్‌లోనే ఉన్నాడు.
వీడియోను చూసినవారు ఏమంటున్నారంటే..
ఎంతో భావోద్వేగంతో కూడిన ఈ వీడియోను చూసినవారు కంటతడి పెడుతున్నారు. గుడ్ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ఒక యూజర్ ‘పిల్లాడికి తీవ్రస్థాయిలో నిమోనియా సోకింది. అందుకే కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ పిల్లాడి తల్లి రోజూ అతని దగ్గరే ఉంటుంది. అయితే ఆ పిల్లాడు కోమాలోంచి లేచిన రోజే బయటకు వెళ్లింది’ అని రాశారు. మరో యూజర్ ఈ వీడియోను చూశాక ‘నా హృదయం కల్లోలంగా మారిందని’ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: హజ్‌యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే..
Comments
Please login to add a commentAdd a comment