
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లారని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. 48 గంటలు గడిస్తేగానీ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశముందని ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్ సునిల్ ఖేమా తెలిపారు. కాగా శనివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక శ్రీ నారాయణ ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రిగా అజిత్‌జోగి ఎన్నికైన విషయం తెలిసిందే. 74 ఏళ్ల అజిత్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీచేసి గెలుపొందారు. (మాజీ సీఎం అజిత్ జోగికి గుండెపోటు)
Comments
Please login to add a commentAdd a comment