
అజిత్ జోగి
రాయ్‌పూర్: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి (79) ఆదివారం కోమాలోకి వెళ్లారు. శనివారం ఉదయం గుండెపోటుతో ఇక్కడి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని, వెంటిలేటర్‌పై ఉన్నారని వైద్యులు తెలిపారు. గుండె పనితీరు బాగానే ఉందని, బీపీ కూడా అదుపులోకి వచ్చిందని చెప్పారు. అయితే శ్వాసకోస వ్యవస్థ పనిచేయకపోవడంతో మెదడు స్పందించడం లేదని, వైద్య పరిభాషలో దీన్ని హైపాక్సియా అంటారని తెలిపారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని చెప్పారు. రానున్న 48 గంటలు కీలకమని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన మొదటి ముఖ్యమంత్రి (2000 నుంచి 2003 వరకు)గా పనిచేశారు. 2016లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి జేసీసీ(జే) అనే పార్టీని సొంతంగా ఏర్పాటుచేశారు.