సాధారణంగా మొసలి నీళ్లలో ఉంటే వెయ్యి ఎనుగులంత బలం అంటారు. నీళ్లలో మొసలికి చిక్కామంటే మన ప్రాణాలు పోవడం ఖాయం. ఒక యువతి మాత్రం తన కవల సోదరి సాయంతో మొసలి పంజా నుంచి తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.. కానీ పదిరోజుల పాటు కోమాలో ఉంది. తాజాగా కోమాలో నుంచి లేచిన ఆమె తన కుటుంబాన్ని మళ్లీ చూస్తానని అనుకోలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
వివరాలు.. లండన్‌కు చెందిన 28 ఏళ్ల మెలిస్సా లౌరి, జార్జియా లౌరిలు కవలలు. ఇద్దరికి బోటింగ్ అంటే మహాప్రాణం. పదిరోజల కిందట మెక్సికోలోని మానియాల్టెపెక్ లగూన్ తీర ప్రాంతానికి బోటింగ్ వెళ్లారు. ప్యూర్టో ఎస్కాండిడో ఐలాండ్‌లో రాత్రికి బస చేశారు. ఆ రాత్రి సరదాగా ఐలాండ్ నుంచి పది మైళ్ల దూరంపాటు స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్లారు. అయితే కొద్దిసేపటి తర్వాత మెలిస్సా ఉన్నట్టుండి నీళ్లలో మునిగిపోయింది. ఆమెకు కొంచెం దూరంలో ఉన్న జార్జియా మెలిస్సా కనిపించకపోవడంతో గట్టిగా కేకలు వేసింది. ఏ రెస్పాన్స్ రాకపోవడంతో ఆమె ప్రమాదంలో పడిందని గ్రహించిన జార్జియా ఆమె దగ్గరికి వెళ్లింది. అప్పటికే మెలిస్సా కాలును బలంగా పట్టుకున్న మొసలి ఆమెను నీటి అడుగుభాగంలోకి లాగడానికి ప్రయత్నిస్తుంది. అయితే జార్జియా చాకచక్యంగా వ్యవహరించి రక్షణ కోసం తనతో పాటు తెచ్చుకున్న వస్తువును మొసలిపై పదేపదే దాడికి పాల్పడంతో మొసలి తన పట్టును విడవడంతో వారిద్దరు నీటిపైకి వచ్చారు. అయితే మొసలి మరోసారి దాడిచేయడంతో ఈసారి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జార్జియా ఎలాగోలా మెలిస్సాను మొసలి బారీ నుంచి కాపాడి బయటకు తీసుకువచ్చింది.
కానీ మెలిస్సా అప్పటికే సృహ కోల్పోయి కోయాలోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి బయటపడిన వీరిద్దరు ఆసుపత్రిలో చేరారు. జార్జియా గాయాలనుంచి కోలుకోగా.. పది రోజల పాటు కోమాలో ఉండిపోయిన మెలిస్సా రెండు రోజుల క్రితం కళ్లు తెరవడంతో ఆమె కుటుంబసభ్యుల్లో ఆందోళన తగ్గింది. కోమా నుంచి బయటపడినా ఊపిరి తీసుకోవడంలో మెలిస్సాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మరోసారి ఆమెను ఐసీయూకి షిఫ్ట్ చేసి ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే ఇప్పడిప్పుడే తనంతట తాను ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో డాక్టర్లు ఆక్సిజన్ పైప్‌ను తీసేశారు. ఈ వార్త ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. కాగా 2019లో 54 ఏళ్ల వ్యక్తి తన బొటనవేలితో మొసలి కంట్లో పొడిచి తన ప్రాణాలను దక్కించుకోవడం సంచలనంగా మారింది.
చదవండి: ఒత్తిడి తగ్గించుకోవడానికి 365 రోజులుగా అదే పనిలో ఉన్నాడు
Comments
Please login to add a commentAdd a comment