ఏవైనా అనుకోని ఘోర ప్రమాధాలు జరిగితే కోమాలోకి వెళ్లడం మామూలే! ఐతే కొంతకాలానికి స్పృహలోకి రావడం, మళ్లీ ఆరోగ్యంగా తిరగడం ఇలాంటివి చాలానే చూసి ఉంటాం.. విని ఉంటాం. సాధారణంగా కోమాలోకి వెళ్తే.. ఒక్కోసారి గతాన్ని మరచిపోవడమో, అంతవరకూ లేని ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడమో జరుగుతుంది. ఏ సమస్యలేకుండా ఆరోగ్యంగా ఉండేవాళ్లు కూడా లేకపోలేదు. అమెరికాకు చెందిన ఓ యువతికి మాత్రం ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఆమె కోమాలోంచి బయటికి వచ్చాక తెలిసింది. తను మరచిపోయింది గతాన్ని కాదు.. ఏకంగా మాతృభాషనే.. అనే విషయం! అసలేంజరిగిందంటే..
సమర్ డియాజ్ 24 యేళ్లు. ఐతే గత ఏడాది అనుకోకుండా జరిగిన ఓ భయానక ప్రమాధంలో తీవ్రగాయాలపాలై కోమాలోకి వెళ్లింది. రెండు వారాల తర్వాత సమర్ సృహలోకొచ్చాక స్పష్టంగా మాట్లాడలేకపోయింది. అనేక స్పీచ్ థెరపీల తర్వాత ఆమె మాట్లాడటం ప్రారంభించింది. వైద్యం అందించేవారికి ఎందుకో అనుమానం వచ్చి ఏ దేశానికి చెందిన పౌరురాలని సమర్‌ను ప్రశ్నించగా.. ఆమె ఇచ్చిన సమాధానం విని అందరూ నోరెళ్ల బెట్టారు. అమెరికాలోని కాలిఫోర్నియా నివాసినని చెప్పింది.
చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్..
అమెరికా నివాసి ఐన సమర్ డియాజ్ తన మాతృభాషకాకుండా అసలు పరిచయమేలేని న్యూజిలాండ్ భాష మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ యువతి తను ఎప్పుడూ న్యూజిలాండ్ వెళ్లలేదని కూడా చెప్పింది. దీని గురించి సన్నిహితులు వెద్యులను ప్రశ్నించగా ఆమె ఓ అరుదైన వ్యాధి బారీన పడ్డట్టు ధృవీకరించారు. వైద్యపరిభాషలో ఈ డిసీజ్‌ను ఫారెన్ యాక్సెంట్ సిండ్రోమ్ అని అంటారు. ఇది వస్తే అప్పటివరకూ మాట్లాడే మాతృభాషకాకుండా వేరే ఇతర భాషను మాట్లాడుతారని వైద్యులు వివరించారు.
ఎవరికైనా ప్రమాధాలు జరిగితే గుండెపోటు రావడం నుంచి పరిస్థితి విషమించి మరణించడం వరకు జరుగుతాయి. ఐతే కొన్ని సార్లు మరణాన్ని జయించి బతుకుతారు కూడా. ఏదిఏమైనప్పటికీ సమర్ డియాజ్ మృత్యువును జయించినా.. మాతృభాషకు బదులు న్యూజిలాండ్ భాష మాట్లాడటం అనేది ప్రస్తుతం టాక్‌ఆఫ్‌ది టౌన్‌గా మారింది.
చదవండి: ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!!
Comments
Please login to add a commentAdd a comment