
బాడీ బిల్డర్, మాజీ మిస్టర్ యూనివర్స్ కాలమ్ వాన్ మోగర్ ప్రాణాలతో పోరాడుతున్నారు. మోగర్ ప్రమాదం నుంచి బయటపడాలని, తర్వాగా కోలుకోవాలని ఆయన అభిమానులు దేవుడిని వేడుకుంటున్నారు. కోమాలో నుంచి బయటపడాలని ప్రార్థిస్తున్నారు.
వివరాల ప్రకారం.. మాజీ మిస్టర్ యూనివర్స్ కాలమ్ వాన్ మోగర్ ఇటీవల రెండవ అంతస్థుల భవనంలోని కిటికీ నుండి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన వెన్నుముకకు గాయమైంది. ప్రమాదం అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మోగర్ కోమాలోకి వెళ్లిపోయాడని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనంలో తెలిపింది. కాగా, ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆయన డ్రగ్స్ మత్తులో ఉన్నారని మోగర్ స్నేహితుడు యూట్యూబర్ నిక్ ట్రిగిల్లి చెప్పారు.
ఇదిలా ఉండగా.. మిస్టర్ వాన్ మోగర్ 2018లో ‘బిగ్గర్’ చిత్రంలో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ పాత్ర చేసి ఎంతో ఫేమస్ అయ్యాడు. దీంతో నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తు ఇలా ప్రమాదంలో మోగర్ గాయపడటంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నిలవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: గుడ్‌బై ఐపాడ్.. బరువెక్కిన గుండెలతో వీడ్కోలు..
Comments
Please login to add a commentAdd a comment