
గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపిన హర్షకుమార్
రాజమండ్రి: క్రైస్తవుల శ్మశాన వాటికలకు స్థలం కేటాయించాలన్న డిమాండ్ తో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ చేపట్టిన రెండు రోజుల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
తొలుత హర్షకుమార్ దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించినా.. ఆయన అనుచరులు పోలీసుల్ని అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే హర్షకుమార్ తన వద్దనున్నతుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. కాగా, హర్షకుమార్ దీక్షను ఎట్టకేలకు భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించారు.