రాజమండ్రిలో హర్షకుమార్ కళాశాల వద్ద ఉద్రిక్తత | High tensions at Harsha kumar's college at Rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో హర్షకుమార్ కళాశాల వద్ద ఉద్రిక్తత

Published Sat, Oct 5 2013 12:40 PM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

High tensions at Harsha kumar's college at Rajahmundry

రాజమండ్రిలో అమలాపురం ఎంపీ హర్షకుమార్కు చెందిన రాజీవ్ గాంధీ కళాశాల వద్ద శనివారం ఉద్రిక్తత కొనసాగుతోంది. ఏపీఎన్జీవో నేతపై హర్షకుమార్ తనయులు దాడి చేయడంతో ఆ కళాశాల వద్దకు భారీగా సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆ కమ్రంలో  అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆందోళనకారులను హెచ్చరించారు. అయితే పోలీసుల హెచ్చరికలను ఆందోళనకారులు పెడచెవిన పెట్టారు. దాంతో పోలీసుల భాష్పవాయువును ప్రయోగించారు. అయితే ఏపీఎన్జీవో నేత ఫిర్యాదుతో హర్షకుమార్ తనయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  



రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా ఈ రోజు ఉదయం రాజీవ్ గాంధీ కళాశాల వద్ద ఏపీఎన్జీవోలు ధర్నా చేపట్టారు. కళాశాల మూసివేయాలని వారు పిలుపునిచ్చారు. ఆ కమ్రంలో అక్కడ ఉన్న హర్షకుమార్ ఫ్లెక్సీని కొందరు చించేశారు. దాంతో హర్షకుమార్ తనయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీఎన్జీవో నేతపై దాడి చేశారు. ఆ ఘటనపై ఏపీఎన్జీవోలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాజీవ్గాంధీ కళాశాలను సమైక్యవాదులు, ఆందోళనకారులు ముట్టడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement