తెలంగాణ వాసులూ ఆధారాలు చూపలేరు!
విద్యార్థులకు ఫీజులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన 'ఫాస్ట్' (ఫైనాన్షియల్ ఎయిడ్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకానికి 1956 నుంచి స్థానికులై ఉండాలన్న ప్రాతిపదిక సరికాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు.
ఫీజుల చెల్లింపునకు స్థానికత నిర్ధారించడానికి 1956 ప్రాతిపదిక అయితే.. నిజమైన తెలంగాణ వాసులు కూడా ఆధారాలు చూపించలేరని ఆయన అన్నారు. తమిళనాడులో తల్లిదండ్రులు స్థానికులు అయితేనే పిల్లలకు ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందుతున్నాయని, అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా తమిళనాడు తరహా స్థానికత విధానం ఉంటే బాగుంటుందని జానారెడ్డి చెప్పారు.