సీఎంకు పాలనా అనుభవం లేదు: పొన్నాల | kcr do not have experience in governance, says ponnala laxmaiah | Sakshi
Sakshi News home page

సీఎంకు పాలనా అనుభవం లేదు: పొన్నాల

Published Tue, Sep 23 2014 2:43 PM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

సీఎంకు పాలనా అనుభవం లేదు: పొన్నాల - Sakshi

సీఎంకు పాలనా అనుభవం లేదు: పొన్నాల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు పాలనా అనుభవం ఏమాత్రం లేదన్న విషయం మరోసారి తేలిపోయందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఫాస్ట్ పథకంతో పాటు నెంబరు ప్లేట్ల మార్పు అంశంలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో ఈ విషయం స్పష్టం అయ్యిందన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన చెప్పారు.

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టప్రకారం, రాజ్యాంగబద్ధంగానే ఫాస్ట్ పథకం ఉండాలని అన్నారు. రుణమాఫీ విషయంలో షరతులు విధించకూడదని, కుటుంబానికి ఒక రుణమే మాఫీ చేస్తామనడం సరికాదని తెలిపారు. అలాగే ఆదర్శ రైతుల వ్యవస్థలో ఏమైనా లోపాలుంటే సరిచేయాలి గానీ, ఏకంగా ఆ వ్యవస్థనే రద్దుచేయడం సరికాదని పొన్నాల తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా కేసీఆర్ వ్యవహరించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement