మంగళగిరిలో జగన్ నిరాహార దీక్ష | ys Jagan's hunger strike in Mangalagiri | Sakshi
Sakshi News home page

మంగళగిరిలో జగన్ నిరాహార దీక్ష

Published Fri, May 15 2015 2:23 AM | Last Updated on Thu, Aug 9 2018 2:42 PM

మంగళగిరిలో  జగన్ నిరాహార దీక్ష - Sakshi

మంగళగిరిలో జగన్ నిరాహార దీక్ష

వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వెల్లడి
 

అనకాపల్లి: చంద్రబాబు హామీలు బూటకమయ్యాయని, ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై జూన్ మొదటివారంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  రెండురోజుల నిరాహారదీక్షకు పూనుకుంటున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖజిల్లా అనకాపల్లి మండలం కొత్తూరులో గురువారం పార్టీ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈసందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మంగళగిరిలో జగన్ దీక్ష చేపడతారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలముందు, తరువాత ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, దీనిపై ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారన్నారు.  రాష్ట్రానికి ప్రత్యేక స్వయంప్రతిపత్తి తీసుకొస్తామన్న నేతలు ఇప్పుడు మాటల గారడీ ప్రదర్శిస్తున్నార న్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement