కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాష్ట్రానికి పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా ప్రకటించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య పేర్కొన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన సోమవారం ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు 115వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బి.వై.రామయ్య మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకుండా మీనమేషాలు లెక్కిస్తూ కంటి తుడుపు చర్యగా చాలీచాలని నిధులు మంజూరు చేసిందని, ఆ నిధుల వల్ల ప్రయోజనం ఉండదని తెలిపారు.
ప్రత్యేక హోదాపై పోరాడే శక్తి టీడీపీకి లేదని, అలా చేస్తే బీజేపీకి దూరమవుతామనే భయం పట్టుకుందని విమర్శించారు. రాష్ట్రానికి హోదాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని, పోలవరం ప్రాజెక్టుకు రూ. 10 వేలు మంజూరు చేయాలని కోరారు. రిలే నిరాహార దీక్షల్లో జెడ్పీ మాజీ ఛైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, ఆదోని మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్ దేవిశెట్టి ప్రకాశ్, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎస్.వేణుగోపాల్‌రెడ్డి, వై.రాంబాబురెడ్డి, ఎస్.సలాం, శివకుమార్, ప్రధాన కార్యదర్శి ఎం.పి.తిప్పన్న, సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మజరుల్‌హక్, కార్యదర్శులు ఎ.నారాయణరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఆర్.ఇమాంపటేల్, రాజ్‌కుమార్, ఖలీల్‌బాష, కాంగ్రెస్ నాయకులు టేకూరు, శ్రీనివాసులు, శ్రీనివాసరెడ్డి, జి.ఎ.కలాం, జోహరాపురం శేఖర్, అబ్బినాయుడు, మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సారమ్మ పాల్గొన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి బండి లాగి నిరసన వ్యక్తం చేసిన మాజీ మేయర్ బంగి
కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌పై నగర మాజీ మేయర్ బంగి అనంతయ్య నగరంలో బండి లాగి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం బుధవారపేటలోని తన నివాసం నుంచి కలెక్టరేట్ వరకు బండి లాగారు. ఈ సందర్భంగా బంగి అనంతయ్య మాట్లాడుతు ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్యాబినేట్‌లో కింగ్‌మేకర్ అయిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏపీకి ప్రత్యేక హోదా తెప్పించడంలో విఫలమయ్యారన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైన వెంకయ్య తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఆయన చేసిన వాగ్ధానాలను నెరవేర్చాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తానని, నూతన రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకారం అందిస్తామని, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేస్తామని హామీలు ఇచ్చినా, ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రాణాలు అర్పించైనా ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని నినాదాలు చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే దాకా పోరాటం
Published Tue, Mar 17 2015 3:28 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement