b y ramayya
-
బడుగు బలహీన వర్గాలకు పెద్దపీఠ వేశారు
సాక్షి, కర్నూలు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీఠ వేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. నిబద్దత, విలువలతో కూడిన రాజకీయ పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. కర్నూలు జిల్లా పరిషత్‌లో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని అన్నారు. జిల్లా పరిషత్ స్థలం అన్యాక్రాంతానికి గురైందని.. ఈ స్థలాన్ని ప్రవేట్ హోటల్‌కు కట్టబెట్టారన్నారు. నయీంలాంటి వ్యక్తులతో చేతులు కలిపి జిల్లా పరిషత్ చైర్మన్ పదివిని కట్టబెట్టారని విమర్శించారు. గౌరు వెంకటరెడ్డి గతంలో టీడీపీకి వత్తాసు పలికాడని అందుకే చైర్మన్ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కోరారు. -
మరో నెలలో వీడనున్న ‘చంద్ర’గ్రహణం
సాక్షి, కర్నూలు : అహంకారంతో విర్రవీగిన చంద్రబాబుకు ఏపీ ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారని చంద్రబాబు కళ్లలో ఓటమి భయం స్పష్టంగా కనబడుతోందని కర్నూల్ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బి.వై.రామయ్య అన్నారు. కర్నూల్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి మరో నెలరోజుల్లో చంద్రగ్రహణం వీడనుందని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేని చంద్రబాబు ఓటు వేసిన ప్రజలనే అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఈవీఎంలపై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని.. తనకు మంచి జరిగితే.. అంతా సక్రమం లేకపోతే అక్రమం అన్న రీతిలో చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరిస్థితి ప్రస్తుతం ఉట్టికి ఎగరేలనమ్మ.. స్వర్గానికి ఎగురుతా అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు చంద్రబాబు ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుని, ఈవీఎంలపై, ఈసీలపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. ఏపిలో వైఎస్ జగన్ చేతిలో ఓటమి ఖరారైనా.. దాన్ని అంగీకరించకపోవడం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. నేడు ప్రజాతీర్పు వైఎస్ జగన్‌కు అనుకూలంగా ఉండటంతో ఈసీ పైనే చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు వైఎస్సార్సీపీ పక్షాన నిలిచారని పేర్కొన్నారు. మార్పు కోసం మహిళలు, వృద్దులు, యువకులు, దిగువ మధ్య తరగతి ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కసితో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వైఎస్సార్సీపీ ధన్యవాదాలు తెలుపుతోందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో రాజన్న పాలనను జగనన్న అందించబోతున్నారని తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలపై ప్రజలు పూర్తి నమ్మకం ఉంచారని అన్నారు. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బలంగా వీస్తోందని.. 130 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లు గెలవబోతోందని అన్నారు. కర్నూలులో 14 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో జనసేన కార్యాలయాలకు టులెట్ బోర్డులు పెట్టారని, మే 23 తరువాత టీడీపీ కూడా ఖాళీ అవ్వడం తథ్యమన్నారు. ఈ సమావేశంలో కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డా. సంజీవ్ కుమార్, కోడుమూరు అభ్యర్థి డా. సుధాకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరాకాష్టకు చేరుకున్న టీడీపీ ఎంపీల డ్రామా
కర్నూలు జిల్లా: ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేస్తున్న డ్రామాలు పరాకాష్టకు చేరుకున్నాయని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య ఎద్దేవా చేశారు. కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ..నాలుగేళ్లుగా ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ..సరికొత్త డ్రామాలకు తెరలేపిందని వ్యాఖ్యానించారు. బీజేపీ తో జత కట్టి మోసం చేస్తుంది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు అఖిల పక్ష భేటి పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికీ వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్లమెటు నిరవధిక వాయిదా పడిన వెంటనే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని వెల్లడించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు జైలు కెళ్లక తప్పదని జోస్యం చెప్పారు. కాంట్రాక్టర్ల, బ్యాంకుల నుంచి టీడీపీ నేతలు దోచుకుంటున్నారని, టీడీపీ తెలుగు దొంగల పార్టీ అని ధ్వజమెత్తారు. జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. మాట తప్పని నేత జగన్ మోహన్ రెడ్డి అని, నాలుగేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ, ప్రత్యేక హోదా సాధించుకునే విషయంలో గానీ చంద్రబాబు ప్రధాన ముద్దాయని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీడీపీ దొందు దొందేనని అన్నారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ సిద్ధమేనని సవాల్ విసిరారు. -
చంద్రబాబు పనైపోయింది
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సీఎం చంద్రబాబునాయుడుకు ఉన్న రాజకీయ అనుభవం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడానికి పనికిరావడం లేదని, ఆయన అవుట్ డేడెట్ సీఎం అని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినా రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదన్నారు. శనివారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడూ ఆయన సొంత ప్రయోజ నాలు కోసమే ప్రయత్నించారన్నారు. ఆయన వేషాలు, డ్రామాలు ఏపీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మైండ్ బ్లాక్... ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ పెట్టే తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటించిన గంటల్లోనే తామే అవిశ్వాసం ప్రవేశపెడతున్నట్లు సీఎం చెప్పడం మాట మీద ఆయన నిలబడరనేందుకు ఉదాహరణ అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ముఖ్యం కాదని ఎంత చిత్తశుద్ధి, విశ్వసనీయత, విలువలు ఉన్నాయన్నదే ప్రధానమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పరితపించే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని చెప్పారు. ఇప్పటికైనా నాటకాలు మాని వైఎస్ఆర్సీపీ ఇచ్చిన అవిశ్వాసానికి టీడీపీ మద్దతు ఇవ్వాలని లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు జీవితాంతం జైలులోనే... సీఎం చంద్రబాబునాయుడు ఆర్థిక, రాజకీయ, సామాజిక నేరగాడు అని బీవై రామయ్య విమర్శించారు. 26 కేసుల్లో విచారణ ఎదుర్కోకుండా స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు. ఆయనపై విచారణ జరిగితే జీవితాంతం జైళ్లో ఉండాల్సి వస్తోందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ చేస్తున్న అవినీతిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆలస్యంగానైనా గుర్తించడం సంతోషమన్నారు. వైఎస్ఆర్సీపీ అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తున్న నేపథ్యంలో సోమవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మానవహారాలు నిర్వహిస్తామని చెప్పారు. గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులకు నిధులేవీ? ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గుండ్రేవుల, వేదవతి, హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి 68 చెరువులకు నీటిని మళ్లింపు తదితర వాటికి బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకుండా, ఆయా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రకటించడంపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప ప్రాజెక్టులపై చిత్తశుద్ధిలేదన్నారు. కేసీ కెనాల్ కింద సాగు చేసిన పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మురళీకృష్ణ, రాష్ట్ర నాయకులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, సీహెచ్ మద్దయ్య, అబ్దుల్ రెహమాన్, కర్నాటి పుల్లారెడ్డి, పర్లా శ్రీధర్‌రెడ్డి, దేవపూజ ధనుంజయాచారి, డి.రాజశేఖర్, నాయకులు రమణ, కరుణాకరరెడ్డి, శివరామిరెడ్డి, భాస్కరరెడ్డి, సాంబశివారెడ్డి, రవిబాబు, రఘు, మళ్లి, బుజ్జీ, శేషుబాబు చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రన్న ముందడుగు కాదు.. దళితుల వెనకడుగు
కర్నూలు : దళితులను ఏం ఉద్ధరించారని చంద్రన్న ముందడుగు అంటూ దళితవాడలకు వస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. కర్నూలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య విలేకరులతో మాట్లాడారు. టీడీపీ చెబుతున్నట్టు అది చంద్రన్న ముందడుగు కాదు - దళితుల వెనకడుగు అని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులు 20 ఏళ్లు వెనకబడ్డారని ఆరోపించారు. ఎవరైనా దళితులు పుట్టాలని కోరుకుంటారా అని గతంలో అవమానపర్చిన చంద్రబాబు నేడు దళితతేజం అనడం సిగ్గుచేటన్నారు. దళిత వ్యతిరేకతను నరనారాన జీర్ణించుకున్న చంద్రబాబు పాలనలో దళిత భక్షణ తప్ప దళితులకు రక్షణ లేదని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానించారు. దళిత సంక్షేమం కేవలం ఒక్క వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే సాధ్యం అయిందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఆశయాలు వైఎస్సార్సీపీ మాత్రమే సాధించగలుగుతుందన్నారు. -
జన్మభూమి ఒక ప్లాప్ షో : వైఎస్సార్సీపీ
కర్నూల్ : జన్మభూమి ఒక ప్లాప్ షో అని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. కర్నూలు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనకు జన్మభూమిలో వస్తున్న లక్షలాది దరఖాస్తులే నిదర్శనమన్నారు. నాలుగువిడతల్లో వచ్చిన ప్రజాసమస్యలలో పరిష్కార జరిగింది 10శాతం మాత్రమేనన్నారు. నాలుగు దశల్లో కూడా ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోవడం ఈ టీడీపీ ప్రభుత్వ వైఫల్యమేనని పేర్కొన్నారు. తమ నాయకుడు చేస్తోన్న సంకల్ప యాత్ర నుంచి ప్రజలను దారి మళ్లించేందుకే ఈ జన్మభూమి నాటకం ఆడుతున్నాడని ఆరోపించారు. జన్మభూమి కార్యక్రమం అంటే టీడీపీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నియోజకవర్గాల్లో పర్యటించడానికి అధికారపార్టీ ఎమ్మెల్యేలు హడలిపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సైతం గ్రామాల్లో వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం గత నాలుగు విడతల్లో జిల్లా వ్యాప్తంగా అందిన అర్జీలు 6,18,839 అని, పరిష్కారం అయినట్టు చెబుతున్నవి 1,90,953 అని, పరిశీలన చేసినా పరిష్కారం కానీ దరఖాస్తులు 2,99,075 అని చెప్పారు. గత నాలుగు విడతల్లో జిల్లాలో మూడు లక్షల ప్రజా సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదో ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి చేసిన ఐదు సంతకాలకే దిక్కులేదు కానీ...నూతన సంవత్సరం రోజున తొలి సంతకం అంటూ గృహానిర్మాణానికి సంబంధించిన ఫైల్ పై సంతకం అంటూ చంద్ర బాబు కొత్త డ్రామా ఆడుతున్నాడని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కట్టని బాబు రానున్న సంవత్సరంలో ఏంచేస్తాడో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడం, లేకపోతే బెదిరించడం టీడీపీ నైజంగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు తీరాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. -
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే దాకా పోరాటం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాష్ట్రానికి పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా ప్రకటించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య పేర్కొన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన సోమవారం ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు 115వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బి.వై.రామయ్య మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకుండా మీనమేషాలు లెక్కిస్తూ కంటి తుడుపు చర్యగా చాలీచాలని నిధులు మంజూరు చేసిందని, ఆ నిధుల వల్ల ప్రయోజనం ఉండదని తెలిపారు. ప్రత్యేక హోదాపై పోరాడే శక్తి టీడీపీకి లేదని, అలా చేస్తే బీజేపీకి దూరమవుతామనే భయం పట్టుకుందని విమర్శించారు. రాష్ట్రానికి హోదాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని, పోలవరం ప్రాజెక్టుకు రూ. 10 వేలు మంజూరు చేయాలని కోరారు. రిలే నిరాహార దీక్షల్లో జెడ్పీ మాజీ ఛైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, ఆదోని మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్ దేవిశెట్టి ప్రకాశ్, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎస్.వేణుగోపాల్‌రెడ్డి, వై.రాంబాబురెడ్డి, ఎస్.సలాం, శివకుమార్, ప్రధాన కార్యదర్శి ఎం.పి.తిప్పన్న, సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మజరుల్‌హక్, కార్యదర్శులు ఎ.నారాయణరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఆర్.ఇమాంపటేల్, రాజ్‌కుమార్, ఖలీల్‌బాష, కాంగ్రెస్ నాయకులు టేకూరు, శ్రీనివాసులు, శ్రీనివాసరెడ్డి, జి.ఎ.కలాం, జోహరాపురం శేఖర్, అబ్బినాయుడు, మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సారమ్మ పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి బండి లాగి నిరసన వ్యక్తం చేసిన మాజీ మేయర్ బంగి కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌పై నగర మాజీ మేయర్ బంగి అనంతయ్య నగరంలో బండి లాగి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం బుధవారపేటలోని తన నివాసం నుంచి కలెక్టరేట్ వరకు బండి లాగారు. ఈ సందర్భంగా బంగి అనంతయ్య మాట్లాడుతు ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్యాబినేట్లో కింగ్‌మేకర్ అయిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏపీకి ప్రత్యేక హోదా తెప్పించడంలో విఫలమయ్యారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైన వెంకయ్య తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఆయన చేసిన వాగ్ధానాలను నెరవేర్చాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తానని, నూతన రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకారం అందిస్తామని, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేస్తామని హామీలు ఇచ్చినా, ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రాణాలు అర్పించైనా ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని నినాదాలు చేశారు.