
కర్నూలులో విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ నేత బీవై రామయ్య
కర్నూలు : దళితులను ఏం ఉద్ధరించారని చంద్రన్న ముందడుగు అంటూ దళితవాడలకు వస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు. కర్నూలు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య విలేకరులతో మాట్లాడారు. టీడీపీ చెబుతున్నట్టు అది చంద్రన్న ముందడుగు కాదు - దళితుల వెనకడుగు అని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులు 20 ఏళ్లు వెనకబడ్డారని ఆరోపించారు.
ఎవరైనా దళితులు పుట్టాలని కోరుకుంటారా అని గతంలో అవమానపర్చిన చంద్రబాబు నేడు దళితతేజం అనడం సిగ్గుచేటన్నారు. దళిత వ్యతిరేకతను నరనారాన జీర్ణించుకున్న చంద్రబాబు పాలనలో దళిత భక్షణ తప్ప దళితులకు రక్షణ లేదని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానించారు. దళిత సంక్షేమం కేవలం ఒక్క వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే సాధ్యం అయిందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఆశయాలు వైఎస్సార్‌సీపీ మాత్రమే సాధించగలుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment