బడుగు బలహీన వర్గాలకు పెద్దపీఠ వేశారు | B Y Ramayya On YS Jagan Mohan Reddy Governance | Sakshi
Sakshi News home page

బడుగు బలహీన వర్గాలకు పెద్దపీఠ వేశారు

Published Sun, Jun 16 2019 1:22 PM | Last Updated on Sun, Jun 16 2019 1:22 PM

B Y Ramayya On YS Jagan Mohan Reddy Governance - Sakshi

సాక్షి, కర్నూలు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీఠ వేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. నిబద్దత, విలువలతో కూడిన రాజకీయ పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. కర్నూలు జిల్లా పరిషత్‌లో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని అన్నారు.

జిల్లా పరిషత్‌ స్థలం అన్యాక్రాంతానికి గురైందని.. ఈ స్థలాన్ని ప్రవేట్ హోటల్‌కు కట్టబెట్టారన్నారు. నయీంలాంటి వ్యక్తులతో చేతులు కలిపి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదివిని కట్టబెట్టారని విమర్శించారు. గౌరు వెంకటరెడ్డి గతంలో టీడీపీకి వత్తాసు పలికాడని అందుకే చైర్మన్‌ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. పరిషత్‌ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్‌ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కోరారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement