ఇది తెలంగాణ ప్రభుత్వానికి అవమానకరం!
హైదరాబాద్: ఫాస్ట్ పథకాన్ని హైకోర్టు ఆక్షేపించడం తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత వైఖరికి నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్మే డా. లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును ఇప్పటికే 5 సార్లు కోర్టులు తప్పబట్టాయని ఎద్దేవా చేశారు. అయినా సీఎం కేసీఆర్ వంటెద్దు పోకడలను, ఏకపక్ష వైఖరిని తగ్గించుకోవడం లేదని లక్ష్మణ్ విమర్శించారు. బేషజాలు, పట్టింపులకు పోకుండా స్థానికత అంశాన్ని రాద్దాంతం చేయకుడదన్నారు.
ఇందుకు అన్ని పార్టీల వారిని విశ్వాసంలోకి తీసుకుని ఫాస్ట్ పథకానికి స్పష్టతనివ్వాలన్నారు. కాలేజీ బకాయిలను చెల్లించి విద్యార్థుల అడ్మిషన్లలో ఉన్న గందరగోళానికి తొలగించాలన్నారు.