మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లండి
హైదరాబాద్:
దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామంటూ ఇచ్చిన ఎన్నికల హామీని సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. రెండున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలన తర్వాత ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై సమావేశం ఏర్పాటు చేయటం సంతోషకరమని చెప్పారు. అయితే, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయడంతోపాటు ఖర్చు చేయడం కూడా అవసరమని తెలిపారు.
దళితులకు కేటాయించిన నిధులను ఖర్చు చేయనట్లయితే వచ్చే సంవత్సరానికి జత చేయాలని సూచించారు. మహిళల అభ్యున్నతి కోసం తక్షణమే మహిళా ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం కేసీఆర్ అఖిలపక్ష బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి తీసుకెళ్లాలని కోరారు.