Dr
-
సెకండ్ టైమ్ కూడా సిజేరియన్ అయితే.. ఏదైనా సమస్యా..!?
ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. సెకండ్ టైమ్. తొలికాన్పు సిజేరియన్. అయితే కుట్లు సరిగా మానలేదు. ఇప్పుడూ సిజేరియన్ అయితే అలాంటి పరిస్థితే వస్తుందేమోనని భయంగా ఉంది. కుట్లు త్వరగా మానేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. ప్రణిత, శ్రీరాంపూర్సిజేరియన్లో కరిగిపోయే కుట్లు వేస్తారు. లేదంటే ఎన్సేషన్ గ్లూతో క్లోజ్ చేస్తారు. మామూలుగా అయితే ఇవి మానడానికి ఒకటి నుంచి రెండు వారాలు పడుతుంది. కానీ శరీరతత్వాన్ని బట్టి మనిషికి మనిషికి తేడా ఉంటుంది. బరువు ఎక్కువున్నవాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువున్న వాళ్లు, ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిలో కుట్లు మానడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. సాధారణంగా .. స్కిన్ వూండ్ని క్లోజ్‌చేసి డ్రెస్సింగ్ చేస్తారు. ఈ డ్రెస్సింగ్ వల్ల గాయం నుంచి ఏదైనా లీకేజ్ వచ్చినా.. అబ్సార్బ్ అయిపోతుంది.గాయం మానడానికి కావల్సిన కండిషన్‌ను క్రియేట్ చేస్తుంది. గాయానికి మనం వేసుకున్న దుస్తులు తగలకుండా చేస్తుంది. అయితే కుట్లు సరిగా మానకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది. అంటే కుట్ల దగ్గర క్రిములు పెరిగి.. చీము పడుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ అయితే కుట్లలో పెయిన్ వస్తుంది. ఎర్రగా మారి వాపూ ఉంటుంది. నీరు, బ్లడ్ వంటి ద్రవాలు లీక్ అవుతుంటాయి. దుర్వాసన వేస్తుంది. హై టెంపరేచర్‌తో జ్వరం వస్తుంది.ఇలాంటి మార్పులు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. త్వరగా డాక్టర్ దగ్గరకు వెళితే ట్రీట్మెంట్ ఈజీగా అయిపోతుంది. ఆసుపత్రిలో చేసిన డ్రెస్సింగ్ డ్రైగానే ఉంటే మూడు రోజుల తర్వాత ఆ డ్రెస్సింగ్‌ని తీసేసి.. ఇంట్లోనే మీరు డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఒకవేళ డ్రెసింగ్ తడిగా ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇంట్లో డ్రెసింగ్ చేసుకునే ముందు సబ్బు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కొని .. తడి లేకుండా తుడుచుకోవాలి.గ్లోవ్ హ్యాండ్‌తోనే డ్రెస్సింగ్‌ని తీసేసి.. మళ్లీ ఫ్రెష్‌గా డ్రెసింగ్ చేసుకోవాలి. కరిగిపోయే కుట్లయితే సాధారణంగా 7–10 రోజుల్లో కరిగిపోతాయి. విప్పే కుట్లయితే 14 రోజుల తర్వాత డాక్టర్ తీసేస్తారు. అప్పటి వరకు కుట్లకు మీరు వేసుకున్న దుస్తులు తగలకుండా కుట్ల దగ్గర కట్టు ఉండటం మంచిది. స్నానం చేసేటప్పుడు తడవకుండా చూసుకోవాలి. కుట్లు విప్పాకే పూర్తిగా షవర్ బాత్ చేయడం మంచిది. కుట్ల మీద స్ట్రాంగ్ సోప్‌ని వాడకూడదు. అలాగే జెల్స్, లోషన్స్ రాసుకోవద్దు.టాల్కం పౌడర్ కూడా వేయొద్దు. ఆపరేషన్ అయిన రెండు వారాలకు కుట్లు పూర్తిగా మానిపోతాయి. అప్పటి నుంచి నడుముకి బెల్ట్ పెట్టుకోవాలి.. నడుము నొప్పి రాకుండా! ఒకవేళ కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే డాక్టర్ చెక్ చేసి.. కుట్ల దగ్గర స్వాబ్ టెస్ట్ చేసి.. ఏ బ్యాక్టీరియా పెరుగుతోంది.. దానికి ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వాలో చూసి.. ట్రీట్మెంట్ ఇస్తారు.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & అబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ)ని కేంద్రం 4శాతం పెంచే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ పెంపు తర్వాత డియర్ నెస్ అలవెన్స్, డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) 50 శాతానికి పైగా పెరగనుంది. చివరి సారిగా 2023 అక్టోబర్ లో కేంద్రం డీఏని 4 శాతం పెంచింది. ఆ నాలుగు శాతం పెంపుతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. తాజా నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. గతంలో పారామిలటరీ బలగాలతో సహా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి స్థాయి అధికారులకు దీపావళి బోనస్‌లను ప్రభుత్వం ఆమోదించింది. 2022–2023కి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకత లేని బోనస్‌ల (అడ్ హాక్ బోనస్‌లు) లెక్కింపు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.7,000 పరిమితిని నిర్ణయించింది . దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే, డీఏ మరింత పెరిగే అవకాశం ఉంది. డీఏ, డీఆర్ పెరుగుదలలు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) యొక్క 12 నెలల సగటు పెరుగుదల శాతం ద్వారా నిర్ణయించబడతాయి. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పేనా?
ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న మధ్యంతర బడ్జెట్‌పై అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులు ఈ బడ్జెట్ కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టే ఈ బడ్జెట్లో సుధీర్ఘ కాలంగా నిలిచిన కరువు భత్యంపై కేంద్రం అనుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్మిక సంఘం ‘భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్’ జనరల్ సెక్రటరీ ముఖేసింగ్ 18 నెలల కాలంలో నిలిచిపోయిన డీఏ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభంలో తలెత్తిన ఆర్ధిక ఇబ్బందులను తలెత్తాయని అంగీకరిస్తూనే.. దేశం మహమ్మారి నుంచి కోలుకుని ఆర్ధిక పరిస్థితులు చక్కబడ్డాయని అన్నారు. పునసమీక్షించాలని లేఖ కాబట్టి, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మూడు విడుతల కరువు భత్యం నిలుపుదల నిర్ణయాన్ని పునసమీకక్షించాలని లేఖ రాశారు. నిలిపివేసిన డీఏ బకాయిలను విడుదల చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విమరణ చేసిన వారి కృషిని గుర్తించడమే కాకుండా దేశానికి చిత్తశుద్ధితో సేవలందించిన వారికి ఉపశమనం లభిస్తుందన్నారు. ముఖేష్ సింగ్ లేఖపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కరువు భత్యం నిలిపివేసింది కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు చెల్లించేందుకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)ను జనవరి 2020 నుంచి జూన్ 2021 అంటే సుమారు 18 నెలలు పాటు నిలిపివేసింది. ఆ సమయంలో కోవిడ్-19 విజృంభణ కారణంగా కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 4 శాతం డీఏ
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ను 4 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 46 శాతానికి చేరింది. అలాగే నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఏ, డీఆర్ పెంపుతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు. వీటితో ఖజానాపై రూ.2,857 కోట్ల భారం పడనుంది. డీఏ పెంపు 2023 జూలై 1 నుంచి వర్తిస్తుంది. గత మార్చి, 2022 సెపె్టంబర్లో డీఏ, డీఆర్ 4 శాతం మేరకు పెరిగాయి. ఇక బోనస్ పెంపుతో లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మెన్, ఇతర గ్రూప్– సి సిబ్బంది సహా 11.07 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. దీని ద్వారా రైల్వేలపై రూ.1,969 కోట్ల ఆరి్ధక భారం పడనుందని ఠాకూర్ తెలిపారు. మరోవైపు చక్కెర ఎగుమతులపై నిషేధాన్ని అక్టోబర్ నెలాఖరును దాటి నిరవధికంగా కేంద్రం పొడిగించింది. భారత్ ప్రపంచంలో అతి పెద్ద చక్కెర తయారీదారు. రెండో అతి పెద్ద ఎగుమతిదారు. 2024–25 రబీ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి గోధుమలకు మద్దతు ధరను మరో రూ.150 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,125గా ఉంది. దీన్ని రూ.2,275కు పెంచినట్లుగా కేంద్రం ప్రకటించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచి్చన తర్వాత ఈ స్థాయిలో మద్దతు ధరను పెంచడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో గోధుమలు సహా బార్లీ, ఎర్రపప్పు, శనగలు, కుసుమ, ఆవాల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎర్రపప్పు (మసూర్) ధర రూ.425 మేర పెంచడంతో క్వింటాల్ ధర రూ.6,425కి చేరింది. ఆవాలకు కనీస మద్దతు ధరను రూ.200 పెంచడంతో అది రూ.5,650కి చేరుకుంది. కుసుమలు క్వింటాల్ రూ.5,650గా ఉండగా, రూ.150 చొప్పున పెంచడంతో రూ.5,800లకు చేరింది. బార్లీ మద్దతు ధరను రూ.115 మేర పెంచడంతో ధర 1,735 నుంచి రూ.1,850కి చేరింది. శనగల «కనీస మద్దతు ధరను రూ.150 మేర పెంచారు. దీని ధర క్వింటాల్‌కు రూ.5,335 నుంచి రూ.5,440కి చేరింది. -
భారత్‌లో లాక్డౌన్ పెట్టకపోతే ఊహించని నష్టం
న్యూయార్క్ : భారత్‌లో ప్రస్తుత కరోనా పరిస్థితులపై అమెరికా వైట్ హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డా. ఆంథోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిత్యం లక్షల్లో నమోదవుతున్న కేసులు, వేల సంఖ్యలో మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో వెంటనే 3-4 వారాలపాటు లాక్డౌన్ విధించాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ సంక్రమణను బ్రేక్ చేయడానికి లాక్డౌన్ తప్పదన్నారు. లాక్‌డౌన్‌తో ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన వద్దని, లాక్డౌన్ కారణంగా కలిగే ఆర్థిక నష్టం కంటే పెట్టకపోతే వచ్చే నష్టం ఇంకా పెద్దదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తాత్కాలిక హాస్పిటల్స్, కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇవ్వాలని, వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెంచాలని తెలిపారు. ఎక్కువ కంపెనీల్లో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలన్నారు. కష్టకాలంలో ఇతర దేశాలకు భారత్ అండగా నిలిచిందని, ప్రస్తుతం భారత్‌కు ప్రపంచదేశాలు మద్దతుగా నిలవాలని.. వైద్య పరికరాలు అందించడమే కాదు.. వైద్య సిబ్బందిని పంపాలని కోరారు. కొద్దిరోజుల క్రితం కూడా ఆయన భారత్‌లోని కరోనా పరిస్థితులపై మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ వ్యాప్తి తీవ్రతతో భారత్ చాలా ఒత్తిడికి గురవుతోంది. అమెరికా మాదిరిగానే మిగతా దేశాలు కూడా భారత్‌కు సాయం అందించేందుకు ముందుకు రావాలి. భారత్‌లో కోవిడ్ చికిత్సలో ఉపయోగించే వైద్య సామాగ్రి కొరత ఉన్న దృష్ట్యా ప్రపంచ దేశాలు అవసరమైన ఆ సామాగ్రిని అందజేయాలి. దీంతోపాటు వైద్య సిబ్బందిని కూడా పంపించాలి. అదే సమయంలో, వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం పౌరులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి. భారత్‌లో అభివృద్ధి పరిచిన రెండు టీకాలతోపాటు, అమెరికా, రష్యాతోపాటు ఇందుకోసం ముందుకు వచ్చే మరే ఇతర దేశాలకు చెందిన సంస్థల నుంచయినా సరే కూడా టీకాలను సేకరించి సాధ్యమైనంత మందికి ఇవ్వడం తక్షణం ప్రారంభించాలి. టీకా ఇవ్వడం వల్ల ప్రస్తుతానికి సమస్య పరిష్కారం కాకపోవచ్చు. కానీ, కొన్ని వారాలపాటు వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు’’అని ఫౌచీ పేర్కొన్నారు. చదవండి : భారత్‌లో పరిస్థితి తీవ్ర ఆందోళనగా ఉంది..సైన్యాన్ని దించండి -
వైఎస్ మాట..విశ్వవిద్యాలయానికి బాట
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ : శ్రీకాకుళం జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. జిల్లా విద్యార్థులు ఉన్నత విద్యభ్యాసానికి గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని 1980వ సంవత్సరం నుంచి జిల్లా ప్రజలు ఉద్యమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అనేక కమిటీలు వేశాయి. అయినా విశ్వవిద్యాలయం ఏర్పాటు కాలేదు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు 2008వ సంవత్సరం జూన్ 25న జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీని మంజూరు చేసి ఏర్పాటు చేశారు. గార మండలం కళింగపట్నానికి చెందిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఏయూ ప్రొఫెసర్ చోడిపల్లి వెంకట సుధాకర్‌ను తొలి వైస్‌చాన్స్‌లర్‌గా నియమించారు. ప్రస్తుతం ఈ వర్సిటీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యలో కీలకంగా మారింది. వర్సిటీలో ఎల్ఎల్బీ, గణితం, జియోఫిజిక్స్, ఫిజిక్స్, జియాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంసీఏ, ఎఈడీ, యోగా డిప్లమో, ఎంఎల్ఐఎస్సీ, బీఈడీ మెంటల్లీ రి టార్డ్, బయోటెక్నాలజీ, తెలుగు, సోషల్ వర్క్, ఎల్ఎల్ఎం, ఇంగ్లీష్, రూరల్ డెవలప్మెంట్, ఎకనామిక్స్, ఎంకాం, ఎంజేఎంసీ, ఎంబీఏ, ఇంజినీరింగ్‌లో సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్ కోర్సులు ఉన్నాయి. కోర్సులు విస్తరిస్తూ విద్యార్థులకు విశ్వవిద్యాలయం అందుబాటులో ఉంది. ప్రత్యేక దృష్టి పెడితే ఈ వర్సిటీ రాష్ట్రంలోనే ఉత్తమ వర్సిటీగా రూపొందే అవకాశం ఉంటుందని పలువురు మేధావులు అభిప్రాయ పడుతున్నారు. విద్యా ప్రగతితోనే ప్రాంతీయ అభివృద్ధి విద్యా ప్రగతితేనే ప్రాంతీయ అభివృద్థి సాధ్యమవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విద్య ప్రాధాన్యాన్ని గుర్తించారు. అందుకే జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం విద్యార్థులు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వెళ్లి చదువుకునేవారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని రానున్న ప్రభుత్వాలు ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన సంస్థగా తీర్చి దిద్దాలి. -మిర్యాల చంద్రయ్య,మాజీ ఇన్చార్జ్ వైస్‌చాన్సలర్ -
కేంద్ర ఉద్యోగులకు 1% డీఏ పెంపు
-
కేంద్ర ఉద్యోగులకు 1% డీఏ పెంపు
► పింఛనుదారులకు కూడా.. ► పన్నురహిత గ్రాట్యుటీ రూ.20 లక్షలకు పెంపు ► కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ► కీలక కమిటీల్లోకి కొత్త కేబినెట్ మంత్రులు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు మేలు చేసేలా కరువు భత్యం (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)లను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రస్తుతమున్న 4 శాతం (మూల వేతనం/పింఛనుపై) డీఏను మరో శాతం పెంచేందుకు అంగీకారం తెలిపారు. దీని ద్వారా 50 లక్షల మంది ఉద్యోగులు, 61 లక్షల మంది పింఛనుదారులకు లాభం చేకూరనుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ ఒక శాతం డీఏ, డీఆర్ పెంపు వర్తిస్తుందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పెంపు ద్వారా ఖజానాపై ఏడాదికి రూ. 3,068.26 కోట్ల భారం పడనుండగా.. 2017–18 సంవత్సరానికే (జూలై 2017–ఫిబ్రవరి 2018) రూ. 2,045.50 కోట్లు భారం పడుతుంది. దీంతోపాటుగా ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ నియంత్రణలోని స్వతంత్ర సంస్థల (సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు వర్తించని) ఉద్యోగులకు చెందాల్సిన పన్ను రహిత గ్రాట్యుటీని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచుతూ సవరించిన బిల్లుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ గ్రాట్యుటీ (సవరణ) బిల్లు–2017ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. 7వ వేతన కమిషన్ ప్రతిపాదనల అమలుకు ముందు ఇది రూ. 10 లక్షలుగా ఉండేది. ఈ పెంపు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి రానుంది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించేందుకే పన్నురహిత గ్రాట్యుటీ పరిధిని పెంచారు. ఒప్పందాల వివరాలు తెలపరా? విదేశాలతో చేసుకునే ఒప్పందాలను తమకు వెల్లడించటంలేదంటూ కేబినెట్ సెక్రటేరియట్ వివిధ ప్రభుత్వ శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ భద్రత, విదేశాలతో సంబంధాలు మినహా సంస్కృతి, సైన్స్ మొదలైన అన్ని ఒప్పందాలను సంబంధిత మంత్రి ఆమోదం తర్వాత కేబినెట్ సెక్రటేరియట్‌కు తెలియజేయాలని కోరింది. తద్వారా విదేశాంగ శాఖకు, కేబినెట్‌కు సమాచారం అందించేందుకు వీలుంటుందని పేర్కొంది. ఒప్పందం జరిగిన నెలలోపు ఈ సమాచారం కేబినెట్ సెక్రటేరియట్‌కు తెలియాల్సిందేనని స్పష్టం చేసింది. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు: ► పదోన్నతి పొందిన మంత్రులు నిర్మలా సీతారామన్ (భద్రత, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలు), పీయూష్ గోయల్ (రాజకీయ, ఆర్థిక వ్యవహారాలు), ధర్మేంద్ర ప్రధాన్ (ఆర్థిక వ్యవహారాలు)లను కీలకమైన కేబినెట్ కమిటీల్లో సభ్యులుగా నియమించారు. మంత్రి ఉమాభారతికి ఇప్పుడు ఏ కమిటీలోనూ సభ్యత్వం లేదు. ► రూ.2,081.27 కోట్లతో దౌండ్–మన్మాడ్ రైల్వే డబ్లింగ్ (247.5 కి.మీ.) పనులకూ కేబినెట్ పచ్చజెండా ఊపింది. ► మొరాకో, అర్మేనియా దేశాలతో జరిగిన ఒప్పందాలకూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. -
అహంకారం చీకటికన్నా ప్రమాదకరం
దురహంకారం, మూర్ఖత్వం కవలపిల్లలు. విషాదమేమిటంటే తన మూర్ఖత్వమే తనకు గొయ్యి తవ్వుతుందన్నది దురహంకారికి తెలియదు. ఈజిప్టు చక్రవర్తి ఫరో దురహంకారి, పరమమూర్ఖుడు కూడా! అక్కడ నాలుగొందల ఏళ్లుగా బానిసలుగా దుర్భర జీవితాన్ననుభవిస్తున్న ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో విడుదల చేయించడానికి దేవుడే పరోక్షంగా ఫరో మూర్ఖత్వం, దురహంకారంతో పోరాడవలసి వచ్చింది. ఇశ్రాయేలీయులు అక్కడ బానిసలే అయినా తమ ప్రతిభాపాటవాలతో, శ్రమతో ఈజిప్టు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. వాళ్లు దేశం వదిలివెళ్లిపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భయంతో ఫరో వారిని విడుదల చేయడానికి ససేమిరా అన్నాడు. ఈజిప్టు ప్రజలు, జంతువుల తొలి సంతానాన్ని దేవుడు హతం చేయడంతో ఫరో దిగి వచ్చి ఇశ్రాయేలీయులను పోనిచ్చాడు. అయితే దేవుడు దూరదృష్టితో వారిని కనానను దేశానికి దర్గరి దారిలో కాక, ఎర్రసముద్రం అడ్డుగా ఉన్న చుట్టు దారిలో నడిపించాడు (నిర్గమ 13: 17,18). ఇశ్రాయేలీయులను వదిలినట్టే వదిలి మనసు మార్చుకొని మూర్ఖత్వంతో వారి సంహారానికి ఫరో తన సైన్యంతో బయలుదేరాడు. ముందు సముద్రం, వెనుక ఫరో సైన్యంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యిలో ఉన్న ఇశ్రాయేలీయులకు, సముద్రాన్ని రెండు పాయలు చేసి మధ్యలో దారిని ఏర్పరచి, దేవుడు వారిని ముందుకు నడిపించాడు. అంతదాకా ఇశ్రాయేలీయులకు నీడనిస్తూ, దారి చూపిస్తున్న మేఘస్తంభాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఫరో సైన్యానికి మధ్యలో పెట్టాడు. అకారణంగా వారిని తరుముతూ వస్తున్న ఫరో సైన్యానికి తాము ఎర్ర సముద్రంలోకి వచ్చామన్నది తెలియలేదు. ఇశ్రాయేలీయులంతా సముద్రపు దారిని దాటేటప్పటికి ఫరో సైన్యం ఆ దారిలో సముద్రం మధ్యలో ఉంది. దేవుడు తిరిగి మేఘస్తంభాన్ని తొలగించి ఇశ్రాయేలీయులకు ముందు పెట్టినప్పుడు కాని ఫరోకు తామెంత ప్రమాదంలో చిక్కుకున్నామో అర్థం కాలేదు. కాని తప్పించుకునే మార్గం లేదు. దేవుడు సముద్రజలాల్ని యధాతథం చేయడంతో ఫరో, అతనితో పాటున్న వేలాదిమంది సైనికులు జలసమాధి అయ్యారు. అలా ఇశ్రాయేలీయులకున్న శత్రుభయమనేది లేకుండా పోయింది. ఈ ఉదంతం రెండు విషయాలు స్పష్టం చేస్తుంది. దగ్గరి దారులుండగా వాటిని కాదని దేవుడు చుట్టు దారిన నడిపిస్తున్నాడన్నా, ఎదురుచూస్తున్న ఆశీర్వాదాన్నివ్వడంలో ఆలస్యం చేస్తున్నాడన్నా, దాంట్లో ఒక మహాగొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడన్నది మొదటి విషయం. తాను బలవంతుడనని దురహంకారంతో ఎంత విర్రవీగినా దేవుడు తలుచుకుంటే చివరికి మట్టి కరిచి చరిత్రహీనుడు కాక తప్పదన్నది రెండవ అంశం. ప్రతికూలత ఎదురైనప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు, అనుకున్నవి అనుకున్నట్లుగా సాగనప్పుడు కృంగిపోకుండా, దేవుడు చుట్టుదారిలో నడిపించినా తుదకు ఆశీర్వాదకరమైన గమ్యానికే చేర్చుతాడని మనం నమ్మాలి. ఫరో బలం ముందు బానిసలైన ఇశ్రాయేలీయులెంత? కాని ఇశ్రాయేలీయుల వెనుక దేవుని బలం ఉన్నదని, ఆ బలాన్ని తానెదుర్కోలేనన్న వివేచనను ఫరో తన దురహంకారం కారణంగా కోల్పోయి దిక్కులేని వాడిలాగా దుర్మరణం చెందాడు. రాత్రి చీకటున్నా పగలు వెలుగుంటుంది. కాని దురహంకారి జీవితంలో పగలు, రాత్రి కూడా చీకటే, అనుక్షణమూ అశాంతే! ఫరో దురహంకార నిర్ణయానికి వేలాదిమంది సైనికులు బలైనట్టే, కొందరు నాయకుల మూర్ఖత్వం, దురహంకారం మొత్తం దేశాన్ని అశాంతిమయం చేయడం ఇప్పుడూ చూస్తున్నాం. కొండను కూడా పెకిలించగల శక్తి మంచితనానిది, మృదుత్వానిదైతే, ఉన్నట్టుండి కొండంత అశాంతికి గురి చేసే శక్తి దురహంకారానిది!! – రెవ.డాక్టర్.టి.ఎ. ప్రభుకిరణ్ -
ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
- పలుచోట్ల సేవా కార్యక్రమాలు బద్వేలు అర్బన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక సుమిత్రానగర్‌లోని షాలోమ్ అనాథ శరణాలయంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో అనాథ పిల్లల నడుమ కేక్ కట్‌చేసి వారికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ జనహృదయ నేతగా నిలిచారన్నారు. ఇది సహించలేని టీడీపీ నేతలు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కుటిల రాజకీయాలు చేస్తుందన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా ప్రజల మనసుల్లో ఆయన స్థానం అలాగే కొనసాగుతుందన్నారు. అలాగే 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. అలాగే స్థానిక మైదుకూరురోడ్డులోని దివ్యజ్యోతి వృద్ధాశ్రమంలో కలసపాడు మాజీ జెడ్పీటీసీ సభ్యులు భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమంలో వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ సింగసాని గురుమోహన్, బ్రాహ్మణపల్లె సింగిల్‌విండో ప్రెసిడెంట్ సుందర రామిరెడ్డి, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శులు అందూరి రామకృష్ణారెడ్డి, సింగసాని శివయ్య, కొండుశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్ గోపాలస్వామి, చిన్నకేశంపల్లె సింగిల్‌విండో అ«ధ్యక్షుడు చిన్నపోలిరెడ్డి, సర్పంచ్ జయసుబ్బారెడ్డి, మున్సిపాలిటీ కన్వీనర్ కరిముల్లా, గోపవరం మండల అ«ధ్యక్షురాలు సరస్వతమ్మ, నాయకులు పుత్తా శ్రీరాములు, రాజగోపాల్‌రెడ్డి, చెన్నక్రిష్ణారెడ్డి, యద్దారెడ్డి, బాలాజీ శ్రీను,కేశవరెడ్డి, మాధవరెడ్డి, వెంకటరత్నం, రఘురామిరెడ్డి, మల్లికార్జున రెడ్డి, మాధవరెడ్డి, సాంబశివారెడ్డి, శేఖర్‌రెడ్డి, ఎస్ఎం. షరీఫ్, సుబ్బరాయుడు యాదవ్, బిజ్జం రమణ, ఆకుల శివ, నాగేశ్వరరావు, కుప్పాల రమణ, మురళి, సిద్దయ్య, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
పెన్షనర్లకు కరువుభృతి పెంపు
జనవరి నుంచే వర్తింపు సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లకు కరువు భృతిని (డీఆర్) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లకు ప్రస్తుతం 15.196 శాతం డీఆర్ అమల్లో ఉండగా దీనికి అదనంగా 3.144 శాతం కలిపి 18.340 శాతం డీఆర్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2016 జనవరి నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు (జీవో నంబర్ 112) జారీ చేశారు. ప్రభుత్వోద్యోగులకు ఇటీవల కరువు భత్యం పెంచిన తరహాలోనే పెన్షనర్లకు ప్రభుత్వం డీఆర్‌ను వర్తింపజేసింది. జనవరి నుంచి చెల్లించాల్సిన బకాయిలను సెప్టెంబర్ పెన్షన్‌తో కలిపి చెల్లించనుంది. అక్టోబర్ 1న బకాయిలతోపాటు పెరిగిన డీఆర్తో కూడిన పెన్షన్ పెన్షనర్లకు అందనుంది. 2013 జూలై 1 తర్వాత రిటైరైన వారితోపాటు అప్పటికే రిటైరై పెన్షన్ అందుకుంటున్న వారందరికీ డీఆర్ వర్తిస్తుంది. ఈ ఉత్తర్వుల ఆధారంగా ట్రెజరీ అధికారులు, పెన్షన్ పేమెంట్ అధికారులు వచ్చే నెల బిల్లుల చెల్లింపులు చేయాలని ఆర్థికశాఖ అన్ని ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఇది తెలంగాణ ప్రభుత్వానికి అవమానకరం!
హైదరాబాద్: ఫాస్ట్ పథకాన్ని హైకోర్టు ఆక్షేపించడం తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత వైఖరికి నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్మే డా. లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును ఇప్పటికే 5 సార్లు కోర్టులు తప్పబట్టాయని ఎద్దేవా చేశారు. అయినా సీఎం కేసీఆర్ వంటెద్దు పోకడలను, ఏకపక్ష వైఖరిని తగ్గించుకోవడం లేదని లక్ష్మణ్ విమర్శించారు. బేషజాలు, పట్టింపులకు పోకుండా స్థానికత అంశాన్ని రాద్దాంతం చేయకుడదన్నారు. ఇందుకు అన్ని పార్టీల వారిని విశ్వాసంలోకి తీసుకుని ఫాస్ట్ పథకానికి స్పష్టతనివ్వాలన్నారు. కాలేజీ బకాయిలను చెల్లించి విద్యార్థుల అడ్మిషన్లలో ఉన్న గందరగోళానికి తొలగించాలన్నారు. -
యవ్వనంలోనే వార్ధక్యం
డాక్టర్స్ కాలమ్ చెట్టునుంచి పండు వేరు పడగానే కొంతసేపు బాగానే ఉంటుంది. సమయం గడిచే కొద్దీ పండులో ముడతలు వస్తూంటాయి. దీనికి కారణం తేమ శాతం తగ్గిపోతూంటుంది. మనిషిలో కూడా అంతే. శరీరానికి గాలి ఎంత ముఖ్యమో నీరూ అంతే ముఖ్యం. తేమ తగ్గిపోతూంటే చర్మంపై ముడతల పడతాయి. యుక్త వయస్సులోనే వార్ధక్యం వస్తుంది. ఇలాంటి సమస్యలకు నగరం వేదికవుతోంది. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం మనిషిని ముప్ఫై ఏళ్లకే ముసలితనంలోకి నెట్టేస్తున్నాయి. దీనికి తోడు పనికొచ్చే తిండి తినకపోవడంతో నిండు యవ్వనులు కూడా కాలుష్యానికి అలసిపోయి ముసలితనాన్ని స్వీకరిస్తున్నారు. రకరకాల చర్మవ్యాధులకూ గురవుతున్నారు. మారిన జీవన పరిస్థితులే దీనికి కారణమంటున్నారు ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డా.కిరణ్‌కుమార్. కాసింత జాగ్రత్తలు పాటిస్తే వార్ధక్యాన్ని దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు ఆయన. చర్మసమస్యలకు ఇవే కారణాలు ► అపరిమిత వాయు కాలుష్యం పలు రకాల చర్మవ్యాధులకు కారణమవుతోంది ► ముఖ్యంగా చర్మం ముడతలు రావడానికి, బట్టతల రావడానికి హేతువు ► కాలుష్యం ప్రభావం ఒంటినిండా మచ్చలు రావడానికి దోహదపడుతోంది ► చాలామంది ముప్ఫై ఏళ్లకే వెంట్రుకలు కోల్పోతున్నారు ► రకరకాల చర్మ సమస్యలు ఎక్కువగా 15 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపువారే ఎదుర్కొంటున్నారు ► చాలామంది ఆఫీసులో ఏసీ గదుల్లో పనిచేస్తారు.. బయటికొస్తే ఎండలో తిరగాలి. ఒక్కసారిగా రెండు రకాల వాతావరణాలకు హార్మోన్లు తట్టుకోలేక పోతున్నాయి. దీంతో ఎక్కువ మంది చర్మ సమస్యలు ఎదుర్కుంటున్నారు ► పోషకాహారానికి దూరం కావడం వల్ల చర్మకాంతికి అవసరమైనవి దక్కకుండా పోతున్నాయి. ► చాలామందికి సమయానికి నిద్ర ఉండదు. నైట్ డ్యూటీలు చేస్తారు. పగలంతా నిద్రపోతారు. దీంతో పలు రకాల సమస్యలు వస్తున్నాయి. ► పైన పేర్కొన్న చాలా సమస్యలు వార్ధక్యానికి (ఎర్లీ ఏజింగ్) దారి తీస్తున్నాయి. ► చాలా మంది యువతీ యువకుల ముఖాలు కళావిహీనంగా తయారవుతున్నాయి యవ్వనం జాగ్రత్తలు ► సమయానికి నిద్ర, సమయానికి తిండి అనేది చర్మంపై మంచి ప్రభావం చూపిస్తుంది ► కాలుష్యం బారినుంచి కొద్దిగా అయినా ఉపశమనం పొందాలంటే బయట తిరిగే సమయంలో ముఖానికి, తలకు కాస్త స్కార్ఫ్ తదితర దుస్తులు వాడటం మంచిది ► వీలైనన్ని నీళ్లు తాగడం ద్వారా చర్మ సంరక్షణను పెంపొందించుకోవచ్చు ► ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, వ్యాయామం వంటివి చేయడం వల్ల చర్మం వర్ఛస్సు బావుంటుంది ► వీలైనంతగా ఏ సీజన్లో లభించే పండ్లు ఆ సీజన్లో తింటే వార్ధక్యం నుంచి బయటపడవచ్చు. ► వీలైనంత వరకూ జంక్‌ఫుడ్‌ను తగ్గించి ఆకుకూరలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు లభిస్తాయి. ► నిల్వ ఉన్న ఆహారం తినకపోవడం మంచిది. బేకరీ ఫుడ్స్ తరచూ తినడం మంచిది కాదు ► ఒకే ఉష్ణోగ్రత ఉన్న పరిస్థితుల్లో పనిచేయడం వలన చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. డా.కిరణ్‌కుమార్ చర్మవ్యాధి నిపుణుడు, ఈషా హాస్పిటల్ సోమాజిగూడ