వ్యవసాయం చేస్తోంది! | Agriculture is! | Sakshi
Sakshi News home page

వ్యవసాయం చేస్తోంది!

Published Wed, Apr 2 2014 10:36 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Agriculture is!

దీక్ష     
 

సంపాదించిన వాడికే ఖర్చు పెట్టే అర్హత ఉంటుంది, అది దాతృత్వంతో ఇచ్చే విరాళమైనా సొంతంగా సంపాదించింది అయితే ఆ ఆనందమే వేరు... అని అంటుంది కేటీ . అనాథల ఆకలిని తీర్చడానికి పాటు పడుతోంది ఈ యువతి. ఏడేళ్ల కిందట తొమ్మిదేళ్ల వయసులో కేటీ సేవా దృక్పథం చిగురు తొడిగింది. ఇప్పుడు మొగ్గగా విరిసింది. అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
 
దాతృత్వం కొద్దీ తమ దగ్గర ఉన్న డబ్బును విరాళంగా ఇచ్చిన వారిని చూసి ఉంటాం. వ్యక్తిగతంగా కష్టపడి వలంటీర్లుగా పేరు తెచ్చుకొన్నవారిని కూడా చూస్తున్నాం. అయితే ఈ రెండింటికీ భిన్నంగా సొంతంగా పంటలు పండించి, ఆ పంటను విరాళంగా ఇస్తోంది కేటీ స్టాగ్లియానో(16). కాలిఫోర్నియాలోని సన్నీవేల్ ప్రాంతానికి చెందిన కేటీ ఇప్పటి వరకూ లెక్కలేనన్ని రోజులపాటు కొన్ని వందల మంది ఆకలిని తీర్చింది. వివిధ అనాథ ఆశ్రమాలకు నిత్యం కాయగూరలను సరఫరా చేస్తూ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొంది.
 
 ఖాళీ స్థలమే సేవకు పెట్టుబడి...

ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న జాగాను సద్వినియోగం చేయాలన్న ఆలోచన కేటీ తల్లిదండ్రులది. అందులో భాగంగా వారు స్థలాన్ని చదును చేసి క్యాబేజీ పండించాలని అనుకొన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులతో పాటు పాలుపంచుకొంది కేటీ. ఖాళీ సమయంలో కలిసి పనిచేసి క్యాబేజీ సాగు చేశారు. మంచి దిగుబడి సాధించారు. అప్పటికే కేటీలో స్థానిక అనాథ ఆశ్రమంపట్ల అపారమైన జాలి ఉంది. తనకంటే తల్లిదండ్రులు ఉన్నారు అన్నీ చూసుకొంటారు. మరి వారికోసం ఎవరున్నారు? వారి కోసం ఏదైనా చేస్తే బావుటుందనేది ఆమె భావన. ఈ నేపథ్యంలో తాము పండించిన క్యాబేజీని మార్కెట్‌కు తరలించి అమ్మడం కన్నా, అనాథాశ్రమానికి డొనేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ మాటే కేటీ తల్లిదండ్రులను అడిగింది. ఆమె తల్లిదండ్రులు కూడా సరదాగా పనిచేశాం, ఖాళీ స్థలంలో సాగు చేశాం... అనే భావనతో కేటీ మాటకు సరేనన్నారు. ఆ క్యాబేజీని అనాథాశ్రమాలకు ఇచ్చారు. ఆ విషయంలో కలిగిన తృప్తి కేటీని అమితానందపరిచింది. పరోపకారంలో ఉన్న ఆనందాన్ని మరింతగా ఆస్వాధించాలన్న ఆలోచనకు కారణమైంది.
 
అంతే అదే జాగాలో మరో పంటను పెట్టే విధంగా తల్లిదండ్రులను ఒప్పించింది. ఈ సారి తనే ఎక్కువ బాధ్యతలు తీసుకొంటూ ఉత్సాహంతో పనిచేసింది. క్యాబేజీతో పాటు కాప్సికం, టమాటో, బీర జాతికి చెందిన వివిధ పంటలను సాగు చేయించింది. యథాతథంగా స్థానిక అనాథాశ్రమాలకు కాయగూరలను ఇచ్చింది.
     
అక్కడ నుంచి అదే తీరున దూసుకెళ్తోంది కేటీ.  చేస్తున్న పని గురించి చెప్పి క్లాస్‌మేట్‌లను కలసిరమ్మని కోరింది. ఈమె పిలుపునందుకొని అనేక మంది టీనేజర్లు ఈ సాగుబడిలో పాలుపంచుకొన్నారు. మంది ఎక్కువయ్యాక తమ వ్యవసాయాన్ని మరింతగా విస్తరించింది. స్థానికుల అనుమతి తీసుకొని సమీపంలోని ఖాళీ స్థలాల్లో పంటలు సాగు చేయసాగింది. డొనేషన్ల రూపంలో కొంత డబ్బును సేకరించి యంత్రాలతో పనులు చేయించింది. ఇప్పుడు కేటీ ఆధ్వర్యంలో చాలా ఎకరాల భూమి సాగవుతోంది. అన్ని చోట్లా ఆహారపంటలే... అలా కొన్ని వందల కేజీల కాయగూరలను అనాథాశ్రమాలకు చేరవేస్తున్నారు.
 
ఇప్పుడు కేటీ శ్రమను, ఆమె దృక్పథాన్ని మెచ్చుకోనివారంటూ లేరు. స్వయంగా ఉత్పాదనకు పూనుకొని ఇలా సేవా నిరతిని కొనసాగిస్తున్న ఆమెను అనాథల ఆకలిని తీరుస్తున్న వ్యక్తిగా గుర్తించాయి అనేక స్వచ్ఛంద సంస్థలు.‘నో హంగ్రీ చిల్డ్రన్’ పేరుతో  సేవా ఉద్యమాన్ని కొనసాగిస్తూ సాగును మరింత విస్తరిస్తూ అనాథలకు ఆహారాన్ని అందిస్తున్న కేటీ సేవలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడా లభించదని అంటోంది. ఆ ఆనందం జీవితకాలం పొందాలన్నదే తనకోరిక అంటోంది. మంచికోరికే!

 ***************

ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న జాగాను సద్వినియోగం చేయాలన్న ఆలోచన కేటీ తల్లిదండ్రులది. అందులో భాగంగా వారు స్థలాన్ని చదును చేసి క్యాబేజీ పండించాలనే అనుకొన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులతో పాటు పాలుపంచుకొంది కేటీ. ఖాళీ సమయంలో కలిసి పనిచేసి క్యాబేజీ సాగు చేశారు. మంచి దిగుబడినా సాధించారు. అప్పటికే కేటీలో స్థానిక అనాథ ఆశ్రమంపట్ల అపారమైన జాలి నిండి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement