బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్‌డీఎస్‌ఎల్)ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలన్న కార్మికుల నినాదాలతో దీక్షాశిబిరం దద్దరిల్లింది. నిజాం షుగర్స్ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం వందరోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎన్‌డీఎస్‌ఎల్ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు , ప్రజా సంఘాల ప్రతినిధులు, రైతులు మొత్తం వంద మంది దీక్షలో కూర్చున్నారు. దీక్షలకు మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నిజాం షుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ వి.రాఘవులు, బీఎంఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రవిశంకర్ సంఘీభావం తెలిపారు.