Nizam Sugar
-
భవిత తేలేనా ..
కసరస్తు చేస్తున్న సర్కారు అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టత ఇవ్వాలని యోచన రెండుమూడు రోజుల్లో రైతులతో మంత్రి కేటీఆర్ బేటీకి అవకాశం బోధన్ : బోధన్‌లోని నిజాంషుగర్స్ భవిత ను తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనే తుది నిర్ణయంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. తాజాగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు నిజాంషుగర్స్ పరిధిలోని నియోజక వర్గాల ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు సమాచారం. ఫ్యాక్టరీ పరిధిలోని ముఖ్యమైన చెరుకు రైతుల నాయకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో రైతులతో కీలక సమావేశం జరుగనుందని సంకేతాలు వస్తున్నాయి. షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు, కార్మికుల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అధికార పక్ష నేతలు, రైతు నాయకులు అంటున్నారు. వారం రోజుల్లో పే ఫ్యాక్టరీ భవిత తేలుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా టీఆర్ఎస్ ఎన్నికల అజెండాలో ముఖ్యమైన అంశంగా నిజాంషుగర్ ఫ్యాక్టరీ సమస్య ఉంది. స్వయంగా సీఎం కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమం, ఎన్నికల సభల్లో నిజాంషుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచి పోయినా ప్యాక్టరీ భవితను తేల్చడంలో విధాన పరంగా స్పష్టత ఇవ్వలేదు. 2015 డిసెంబర్ 23న నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) యాజమాన్యం చెరుకు, నీటి లభ్యత కొరత కారణాలు చూపి లేఆఫ్ ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఎన్డీఎస్ఎల్తో పాటు జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట, మెదక్ జిల్లాలోని ముంబోజిపల్లి యూనిట్లను మూసివేసింది. ముఖ్య వ్యవసాయాధార పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీల మూసివేతతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఫ్యాక్టరీలు మూసివేసి ఏడాది కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు పునరుద్ధరణకు స్పష్టత ఇవ్వలేదు.మూడు ఫ్యాక్టరీల మూసివేతతో వందలాది మంది కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. చెరుకు పంట సాగు చేసిన రైతులు జిల్లాలోని ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలకు చెరుకును మళ్లించారు. అఖిల పక్షాలు, కార్మిక ,రైతు సంఘాలు, నిజాంషుగర్స్ రక్షణ కమిటీల నేతృత్వంలో బోధన్‌లో 10 నెలలకు పైగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో బోధన్ నియోజక వర్గం పరిధిలోని నాలుగు రోజుల పాటు రైతు పాదయాత్ర చేపట్టారు. 2015 జనవరి 5న సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో మూడు ఫ్యాక్టరీల పరిధిలో చెరుకు రైతుల సమావేశం నిర్వహించారు. రైతులు ముందుకువస్తే ఫ్యాక్టరీని ఆధునీకరించి అప్పగిస్తామని అన్నారు. అయితే ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడుపాలని రైతులు స్పష్టం చేశారు. 20 రోజుల క్రితం ఎంపీ కల్వకుంట్ల కవిత రైతులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించారు. ప్రభుత్వం కాలయాపన చేస్తోందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని తెలుస్తోంది -
చెరుకు రైతు సమస్యలు పరిష్కరించండి
తమ్మినేని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చెరుకు రైతుల సమస్యల పరి ష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం కోరింది. ఎన్నికల ముందు చెరుకు రైతులను ఆదు కుంటామని, నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని, నిజామాబాద్ జిల్లాలో చెరుకు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పేర్కొన్నట్లు గుర్తు చేసింది. చెరుకు రైతులకు రవాణా, కటింగ్ ఖర్చులు తలకు మించిన భారంగా మారి నందున కంపెనీలే వీటిని భరించేలా జోక్యం చేసుకోవాలని సీఎంకు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశా రు. చెరుకు రికవరీ 8.5 శాతముంటే రూ.4 వేల మద్దతు ధర ఇవ్వాలని, విత్తనం ఉచితంగా ఇవ్వాలని, ఎరువులు, పురుగు మందులు, వడ్డీ లేని రుణాలిచ్చి, పంటల బీమాను ప్రభుత్వమే చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. -
నిజాం షుగర్స్ ప్రైవేటుపరం చేసింది బాబే
* నిజామాబాద్ ఎంపీ కవిత మండిపాటు * టీడీపీ ప్రైవేటుపరం చే సినా కాంగ్రెస్ పట్టించుకోలేదు * ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది * రైతులకు ఇప్పటిదాకా రూ. 66 కోట్ల సాయం చేసింది * దీనిపై జేఏసీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది సాక్షి, హైదరాబాద్: నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ 1937లోనే 98 శాతం నిజాం ప్రభుత్వ వాటా, 2 శాతం ప్రైవేటు వాటాతో మొదలై ఎంతో వైభవాన్ని చవిచూసిందని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. గురువారం తెలంగాణ భవన్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు పెద్దలు ఇచ్చిన వారసత్వ సంపదైన ఈ సంస్థను 2002లో అప్పటి సీఎం చంద్రబాబు జాయింట్ వెంచర్ పేరిట డెల్టా పేపర్ మిల్స్‌కు 51 శాతం వాటా కట్టబెట్టి ప్రైవేటుపరం చేశారని విమర్శించారు. లాభాల్లో నడుస్తున్న ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడంపై అప్పట్లో పట్టించుకున్న వారు లేరన్నారు. నిజాం షుగర్స్ ప్రైవేటుపరం అయినప్పట్నుంచి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా నష్టాలు చూపుతూ వచ్చిందని, 2004 నుంచి పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ విషయంలో ఏమీ పట్టించుకోలేదన్నారు. 2006లో నాటి ప్రభుత్వం హౌస్ కమిటీ వేసినా 2012 వరకు నిర్ణయాన్ని ప్రకటించలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2014 నుంచి ఇప్పటివరకు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు, రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 66 కోట్ల సాయం చేసిందని కవిత చెప్పారు. వరుస నష్టాలు చూపించి యాజమాన్యం లాకౌట్ ప్రకటించిందని, ఇప్పుడు ఈ వ్యవహారం బీఐఎఫ్ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రికన్స్ట్రక్షన్) పరిధిలో ఉందని, ఆ సంస్థ నిర్ణయం తీసుకునే వరకు ఏమీ చేయలేమన్నారు. సహకార పద్ధతిలో నడుపుకుంటే మంచిది నిజాం షుగర్స్‌కు గత వైభవం రావాలంటే రైతులు సహకార పద్ధతిలో ఫ్యాక్టరీని నడిపేందుకు ముందుకొస్తే అప్పగించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్ధంగా ఉన్నారని కవిత తెలిపారు. ఈ విషయంలో అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులంతా అండగా ఉంటామన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే పెద్దలమని చెప్పుకునే జేఏసీ మాత్రం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌లో అఖిలపక్ష సమావేశం అని చెప్పి విపక్షాలను పిలిచి తమను పిలవలేదని, తమను పిలిచి ఉంటే వాస్తవం ఏమిటో చెప్పేవారమన్నారు. లే ఆఫ్ ప్రకటించి నందు వల్ల 400 మంది ఉద్యోగులకు 50 శాతం వేతనాలు ఇవ్వాలని యాజమాన్యానికి కార్మికశాఖ ఇప్పటికే నోటీసులు ఇచ్చిందని, వీఆర్ఎస్ ఇప్పించేందుకూ ఒత్తిడి తెస్తామని చెప్పారు. తప్పు చేస్తే ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరు ఓటుకు కోట్లు కేసుపై కవిత ‘‘తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరు. మన చట్టాలు ఇప్పటికే ఈ విషయాన్ని నిరూపించాయి. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక డెరైక్షన్ అవసరం లేదు. ఇప్పటికే కేసు విచారణ జరుగుతోంది’’ అని కవిత పేర్కొన్నారు. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయంపై ఆరోపణల నేపథ్యంలో కేసును తిరిగి విచారించాలంటూ ఏసీబీ కోర్టు ఏసీబీని ఆదేశించడంపై కవిత ఈ మేరకు స్పందించారు. ఈ కేసుతో ప్రమేయమున్న వారిని ఏసీబీ విచారిస్తుందన్నారు. ఏసీబీ కోర్టు నోటీసు పూర్తిగా సాంకేతికపరమైనదని, దీనిపై ఏసీబీ అధికారులు కోర్టుకూ ఇదే చెప్పారన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకన్నా ఎక్కువ స్పందించలేన ని, కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏసీబీ శాఖాపరంగా కోర్టుకు వివరాలు అందిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.విద్యాసాగర్‌రావు, షకీల్, జీవన్‌రెడ్డి, ఆలె వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నిజాం షుగర్స్ దీక్షలో వందమంది..
బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్)ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలన్న కార్మికుల నినాదాలతో దీక్షాశిబిరం దద్దరిల్లింది. నిజాం షుగర్స్ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం వందరోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎన్డీఎస్ఎల్ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు , ప్రజా సంఘాల ప్రతినిధులు, రైతులు మొత్తం వంద మంది దీక్షలో కూర్చున్నారు. దీక్షలకు మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నిజాం షుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ వి.రాఘవులు, బీఎంఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రవిశంకర్ సంఘీభావం తెలిపారు. -
ప్రభుత్వ ఆధీనంలోకి నిజాం షుగర్స్
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి స్వా ధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయి ంచింది. తమ నుంచి చెరుకు కొనుగోలు చేసి నా ఫ్యాక్టరీ యాజమాన్యం డబ్బు చెల్లించడం లేదని, ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలని ఇటీవల ఆ ప్రాంత రైతులు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం వాస్తవాలపై నివేదిక తెప్పించుకున్నారు. రైతులకు డబ్బు చెల్లించడం లేదంటే ఫ్యాక్టరీని నడపాలనే ఉద్దేశం యాజమాన్యానికి ఉన్నట్టుగా లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. రైతులను, కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీని నిర్వహించాలని నిర్ణయించిన సీఎం విధి విధానాలు రూపొందించాల్సిందిగా కార్యదర్శుల కమిటీని అదేశించారు. రైతుల బకాయిలను తామే చెల్లించి ఫ్యాక్టరీని నడిపిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారని బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. -
మాటలు చెప్పి..కోటలు కూల్చి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రూ. 308 కోట్ల నష్టం జరి గినా, రూ.65.45 కోట్లకే డెల్టా పేప ర్ మిల్స్‌కు నిజాం షుగర్ ఫాక్టరీని ధారదత్తం చేసిన చీకటి ఒప్పందం ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది పొట్టకొట్టింది. లాభాల బాటలో నడుస్తున్న ఫ్యాక్టరీని నష్టాల సాకుతో టీడీపీ హయాంలో ప్రయివేటు పరం చేసిన ఘటనను ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. 1936 ని జాం కాలంలో శక్కర్‌నగర్‌లో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. చెరుకు సాగు కోసం ని జాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. 16 వే ల ఎకరాలను కేటాయించారు. కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. నిజాంపాలన ముగిసిన తర్వాత ఫ్యాక్టరీ ప్ర భుత్వ స్వాధీనమైంది. ఇది జిల్లా అభివృద్ధి కే కాక, రాష్ట్రంలో చక్కెర పరిశ్రమ చంద్రబాబు హయాంలో 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యాక్టరీని కారు చౌకగా ప్రయివేటు సంస్థకు అప్పగించారు. తరువాత ఈ కర్మాగారం నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. శక్కర్‌నగర్ ప్రధాన యూనిట్‌తోపాటు కరీంనగర్ జిల్లా మెట్పల్లి, మెదక్ జిల్లా ముంబోజిపేట ఫ్యాక్టరీలను ప్రైవేట్ సంస్థ స్వాధీనమయ్యాయి. రైతు, కార్మిక సంఘాలు తీవ్రస్థాయి లో వ్యతిరేకించినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రయివేటీకరణ లో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని తీవ్ర ఆ రోపణలు వచ్చాయి. వైఎస్ విజయమ్మ పిటిషన్ చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరుపాలని 2011 అక్టోబర్‌లో వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలమైన ఆధారాలతో 18 ఆరోపణలు పిటిషన్లో పొందుపర్చగా, ఇందులో నిజాం దక్కన్ షుగర్స్ ప్రైవేటీకరణ అవి నీతి అంశం కూడా ఉంది. వైఎస్ఆర్ హయాంలో శాసనసభా సంఘం నిజాం షుగర్స్ ప్రయివేటీకరణలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2006లో సభాసంఘాన్ని నియమిం చారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్‌రావు చైర్మన్‌గా, ఎ మ్మెల్యేలు పి. సుదర్శన్ రెడ్డి, ఎస్ గంగారాం, సురేశ్ షెట్కార్, బాజి రెడ్డి గోవర్ధన్, జి.చిన్నారెడ్డి, పద్మాదేవేందర్ రెడ్డి, కళా వెంకట్రావు, మర్రి శశిధర్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. సభా సంఘం విచారణ చేసి 350 పే జీల నివేదికను ప్రభుత్వానికి అం దించింది. ప్ర యివేటీకరణలో అక్రమాలు జరిగాయని తేల్చి చెప్పింది. తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. నివేదిక వచ్చి ఏళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ప ట్టించుకోలేదు. ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, రైతు, నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీలు పదకొండేళ్లుగా పోరాడుతున్నాయి. నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం. అప్పిరెడ్డి సభా సంఘం సిఫారసులు అమలు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి అక్షింత లు వేసినా పట్టించుకోలేదు.