సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రూ. 308 కోట్ల నష్టం జరి గినా, రూ.65.45 కోట్లకే డెల్టా పేప ర్ మిల్స్‌కు నిజాం షుగర్ ఫాక్టరీని ధారదత్తం చేసిన చీకటి ఒప్పందం ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది పొట్టకొట్టింది. లాభాల బాటలో నడుస్తున్న ఫ్యాక్టరీని నష్టాల సాకుతో టీడీపీ హయాంలో ప్రయివేటు పరం చేసిన ఘటనను ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. 1936 ని జాం కాలంలో శక్కర్‌నగర్‌లో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. చెరుకు సాగు కోసం ని జాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. 16 వే ల ఎకరాలను కేటాయించారు. కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. నిజాంపాలన ముగిసిన తర్వాత ఫ్యాక్టరీ ప్ర భుత్వ స్వాధీనమైంది.
ఇది జిల్లా అభివృద్ధి కే కాక, రాష్ట్రంలో చక్కెర పరిశ్రమ చంద్రబాబు హయాంలో 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యాక్టరీని కారు చౌకగా ప్రయివేటు సంస్థకు అప్పగించారు. తరువాత ఈ కర్మాగారం నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. శక్కర్‌నగర్ ప్రధాన యూనిట్‌తోపాటు కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి, మెదక్ జిల్లా ముంబోజిపేట ఫ్యాక్టరీలను ప్రైవేట్ సంస్థ స్వాధీనమయ్యాయి. రైతు, కార్మిక సంఘాలు తీవ్రస్థాయి లో వ్యతిరేకించినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రయివేటీకరణ లో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని తీవ్ర ఆ రోపణలు వచ్చాయి.
వైఎస్ విజయమ్మ పిటిషన్
చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరుపాలని 2011 అక్టోబర్‌లో వైఎస్‌ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలమైన ఆధారాలతో 18 ఆరోపణలు పిటిషన్‌లో పొందుపర్చగా, ఇందులో నిజాం దక్కన్ షుగర్స్ ప్రైవేటీకరణ అవి నీతి అంశం కూడా ఉంది.
వైఎస్‌ఆర్ హయాంలో శాసనసభా సంఘం
నిజాం షుగర్స్ ప్రయివేటీకరణలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2006లో సభాసంఘాన్ని నియమిం చారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్‌రావు చైర్మన్‌గా, ఎ మ్మెల్యేలు పి. సుదర్శన్ రెడ్డి, ఎస్ గంగారాం, సురేశ్ షెట్కార్, బాజి రెడ్డి గోవర్ధన్, జి.చిన్నారెడ్డి, పద్మాదేవేందర్ రెడ్డి, కళా వెంకట్రావు, మర్రి శశిధర్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. సభా సంఘం విచారణ చేసి 350 పే జీల నివేదికను ప్రభుత్వానికి అం దించింది. ప్ర యివేటీకరణలో అక్రమాలు జరిగాయని తేల్చి చెప్పింది.
తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. నివేదిక వచ్చి ఏళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ప ట్టించుకోలేదు. ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, రైతు, నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీలు పదకొండేళ్లుగా పోరాడుతున్నాయి. నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం. అప్పిరెడ్డి సభా సంఘం సిఫారసులు అమలు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి అక్షింత లు వేసినా పట్టించుకోలేదు.
మాటలు చెప్పి..కోటలు కూల్చి
Published Thu, Apr 17 2014 4:22 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement