Delta Paper Mills
-
నిజాం దక్కన్ షుగర్స్‌లో తేలిన వాటాలు
♦ డెల్టా పేపర్ మిల్స్ ఈక్విటీ రూ.48.15 కోట్లు ♦ జాయింట్ వెంచర్ ఆస్తులు, అప్పుల మదింపు సాక్షి, హైదరాబాద్: నిజాందక్కన్ షుగర్స్ లిమిటెడ్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నియమించిన ఎస్బీఐ క్యాప్స్ సంస్థ ఆస్తులు, అప్పులపై నివేదిక సమర్పించింది. ఈక్విటీ షేర్లు, ఇతర వాటాలు, రుణాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని మదింపు చేసి న ఎస్బీఐ క్యాబ్స్ భాగస్వామ్య సంస్థ డెల్టా పేపర్‌మిల్స్ వాటాను 58.67%గా తేల్చింది. ఈ లెక్కన రూ.48.15 కోట్ల ఈక్విటీని చెల్లిస్తే ఎన్డీఎస్ఎల్ను తిరిగి స్వాధీనం చేసుకునే వీలుంటుందని సిఫారసు చేసింది. సంయుక్త భాగస్వామ్య సంస్థ నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్)లో ప్రస్తుతం నిజాం షుగ ర్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్), డెల్టా పేపర్‌మిల్స్ (డీపీఎం) భాగస్వాములుగా ఉన్నాయి. 2002 ఆగస్టు 28న ఈ రెండు భాగస్వామ్య సంస్థల నడుమ కుదిరిన ఒప్పందం ప్రకారం ఎన్ఎస్ఎల్ వాటా 49 శాతం కాగా, డీపీఎం వాటా 51 శాతం. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఎల్ నిర్వహణ బాధ్యతను డెల్టా పేపర్ మిల్స్ చేపట్టింది. కాగా నష్టాలను సాకుగా చూపుతూ 2015-16 సీజన్ నుంచి చెరుకు క్రషింగ్ చేయలేమంటూ ఎన్డీఎస్ఎల్ భాగస్వామ్య సంస్థ డీపీఎం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఎల్ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ‘కార్యదర్శుల కమిటీ’కి అప్పగించింది. ఎన్డీఎస్ఎల్ ఆస్తులు, అప్పులు తదితరాలను మదింపు చేసే బాధ్యతను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎస్బీఐ క్యాపిటల్ మార్కెటింగ్ లిమిటెడ్ (ఎస్బీఐ క్యాప్స్) అనే సంస్థకు కార్యదర్శుల కమిటీ అప్పగించింది. -
నిజాం మిల్లుతో రైతులకు మేలుజరగాలి
వనపర్తిటౌన్ : చంద్రబాబు హయాంలో అప్పనంగా డెల్టా పేపర్మిల్లుకు కట్టబెట్టిన నిజాం షుగర్‌మిల్లును ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం హర్షించదగిన విషయమని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం వనపర్తిలోని పీఆర్ అతిథి గృహాంలో విలేకరులతో మాట్లాడారు. 2004లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం రత్నాకర్ అధ్యక్షతన పద్మాదేవేందర్‌రెడ్డిలతో హౌస్‌కమిటీ వేస్తే కార్మికులు, రైతులకు అన్యాయం జరిగిందని తాము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. అప్పట్లో షుగర్ మిల్లుకు వ్యతిరేకంగా రిపోర్ట్ తయారుచేయాలని ఒత్తిడివచ్చినా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేశామని గుర్తుచేశారు. నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారిని నిజాం మిల్లుకు డెరైక్టర్‌ను చేసి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు తైలం శకర్ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతయ్య, కేజీ మూర్తి, శ్యాం, ధనలక్ష్మి, బాబా పాల్గొన్నారు. -
మాటలు చెప్పి..కోటలు కూల్చి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రూ. 308 కోట్ల నష్టం జరి గినా, రూ.65.45 కోట్లకే డెల్టా పేప ర్ మిల్స్‌కు నిజాం షుగర్ ఫాక్టరీని ధారదత్తం చేసిన చీకటి ఒప్పందం ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది పొట్టకొట్టింది. లాభాల బాటలో నడుస్తున్న ఫ్యాక్టరీని నష్టాల సాకుతో టీడీపీ హయాంలో ప్రయివేటు పరం చేసిన ఘటనను ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. 1936 ని జాం కాలంలో శక్కర్‌నగర్‌లో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. చెరుకు సాగు కోసం ని జాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. 16 వే ల ఎకరాలను కేటాయించారు. కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. నిజాంపాలన ముగిసిన తర్వాత ఫ్యాక్టరీ ప్ర భుత్వ స్వాధీనమైంది. ఇది జిల్లా అభివృద్ధి కే కాక, రాష్ట్రంలో చక్కెర పరిశ్రమ చంద్రబాబు హయాంలో 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యాక్టరీని కారు చౌకగా ప్రయివేటు సంస్థకు అప్పగించారు. తరువాత ఈ కర్మాగారం నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. శక్కర్‌నగర్ ప్రధాన యూనిట్‌తోపాటు కరీంనగర్ జిల్లా మెట్పల్లి, మెదక్ జిల్లా ముంబోజిపేట ఫ్యాక్టరీలను ప్రైవేట్ సంస్థ స్వాధీనమయ్యాయి. రైతు, కార్మిక సంఘాలు తీవ్రస్థాయి లో వ్యతిరేకించినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రయివేటీకరణ లో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని తీవ్ర ఆ రోపణలు వచ్చాయి. వైఎస్ విజయమ్మ పిటిషన్ చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరుపాలని 2011 అక్టోబర్‌లో వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలమైన ఆధారాలతో 18 ఆరోపణలు పిటిషన్లో పొందుపర్చగా, ఇందులో నిజాం దక్కన్ షుగర్స్ ప్రైవేటీకరణ అవి నీతి అంశం కూడా ఉంది. వైఎస్ఆర్ హయాంలో శాసనసభా సంఘం నిజాం షుగర్స్ ప్రయివేటీకరణలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2006లో సభాసంఘాన్ని నియమిం చారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్‌రావు చైర్మన్‌గా, ఎ మ్మెల్యేలు పి. సుదర్శన్ రెడ్డి, ఎస్ గంగారాం, సురేశ్ షెట్కార్, బాజి రెడ్డి గోవర్ధన్, జి.చిన్నారెడ్డి, పద్మాదేవేందర్ రెడ్డి, కళా వెంకట్రావు, మర్రి శశిధర్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. సభా సంఘం విచారణ చేసి 350 పే జీల నివేదికను ప్రభుత్వానికి అం దించింది. ప్ర యివేటీకరణలో అక్రమాలు జరిగాయని తేల్చి చెప్పింది. తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. నివేదిక వచ్చి ఏళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ప ట్టించుకోలేదు. ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, రైతు, నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీలు పదకొండేళ్లుగా పోరాడుతున్నాయి. నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం. అప్పిరెడ్డి సభా సంఘం సిఫారసులు అమలు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి అక్షింత లు వేసినా పట్టించుకోలేదు.