వనపర్తిటౌన్ : చంద్రబాబు హయాంలో అప్పనంగా డెల్టా పేపర్‌మిల్లుకు కట్టబెట్టిన నిజాం షుగర్‌మిల్లును ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం హర్షించదగిన విషయమని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం వనపర్తిలోని పీఆర్ అతిథి గృహాంలో విలేకరులతో మాట్లాడారు. 2004లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం రత్నాకర్ అధ్యక్షతన పద్మాదేవేందర్‌రెడ్డిలతో హౌస్‌కమిటీ వేస్తే కార్మికులు, రైతులకు అన్యాయం జరిగిందని తాము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు.
అప్పట్లో షుగర్ మిల్లుకు వ్యతిరేకంగా రిపోర్ట్ తయారుచేయాలని ఒత్తిడివచ్చినా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేశామని గుర్తుచేశారు. నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారిని నిజాం మిల్లుకు డెరైక్టర్‌ను చేసి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు తైలం శకర్‌ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతయ్య, కేజీ మూర్తి, శ్యాం, ధనలక్ష్మి, బాబా పాల్గొన్నారు.
నిజాం మిల్లుతో రైతులకు మేలుజరగాలి
Published Fri, May 1 2015 3:33 AM | Last Updated on Fri, Aug 17 2018 6:03 PM
Advertisement