చెరుకు రైతు సమస్యలు పరిష్కరించండి
తమ్మినేని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చెరుకు రైతుల సమస్యల పరి ష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం కోరింది. ఎన్నికల ముందు చెరుకు రైతులను ఆదు కుంటామని, నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని, నిజామాబాద్ జిల్లాలో చెరుకు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ పేర్కొన్నట్లు గుర్తు చేసింది. చెరుకు రైతులకు రవాణా, కటింగ్ ఖర్చులు తలకు మించిన భారంగా మారి నందున కంపెనీలే వీటిని భరించేలా జోక్యం చేసుకోవాలని సీఎంకు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశా రు. చెరుకు రికవరీ 8.5 శాతముంటే రూ.4 వేల మద్దతు ధర ఇవ్వాలని, విత్తనం ఉచితంగా ఇవ్వాలని, ఎరువులు, పురుగు మందులు, వడ్డీ లేని రుణాలిచ్చి, పంటల బీమాను ప్రభుత్వమే చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు.