తెలంగాణ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తన నివాసంలో టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం దీక్షకు దిగారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్కులో భూనిర్వాసితులతో దీక్ష చేయాలని టీజేఏసీ నిర్ణయించింది. అయితే, ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో దీక్షను జేఏసీ వాయిదా వేసింది.