సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(93) అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావటంతో ఎయిమ్స్‌కు తరలించారు. ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.
అయితే రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన్ని ఎయిమ్స్‌కు తరలించినట్లు ఆయన కార్యదర్శి మహేంద్ర పాండే ఓ ప్రెస్ నోట్ మీడియాకు విడుదల చేశారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలోని బృందం వాజ్‌పేయికి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో వాజ్‌పేయి గురించి కొన్ని ఫేక్ న్యూస్‌లు వైరల్ కాగా, కొన్ని మీడియా ఛానెళ్లు ఇప్పుడు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి బ్రేకింగ్‌లు ఇవ్వటం గమనార్హం.
నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్‌గా ఉన్న వాజ్‌పేయి.. భారత దేశానికి పదో ప్రధానిగా పనిచేశారు. కాంగ్రెసేతర ప్రధానిగా దేశాన్ని ఐదేళ్లు పాలించిన ఘనత కూడా వాజ్‌పేయిదే. వివాదరహితుడిగా ప్రతిపక్ష పార్టీలతోపాటు పలువురి ప్రశంసలు ఆయన అందుకున్నారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పలువురు సందేశాలు పెడుతున్నారు.
Former PM AB Vajpayee admitted in AIIMS. @ThePrintIndia pic.twitter.com/mSzVh0z0wt
— Pragya Kaushika (@pragyakaushika) 11 June 2018
Comments
Please login to add a commentAdd a comment