జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోమవారం జైలు అధికారులు డాక్టర్లతో వైద్య పరీక్షలు నిర్వహించారు.
హైదరాబాద్ : జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోమవారం జైలు అధికారులు డాక్టర్లతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం మరోసారి ఆయనకు వైద్యులు పరీక్షలు చేయనున్నారు. అనంతరం జగన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. సమన్యాయం చేయాలంటూ జగన్ చంచల్‌గూడ జైలులో నిరాహార దీక్షకు దిగి 30 గంటలు దాటింది. నిన్న ఉదయం ఆరు గంటలకు ఆయన తన దీక్ష మొదలుపెట్టారు.
అప్పటి నుంచి ఆయన ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదు. నిన్న సాయంత్రం నుంచి ఆయనకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తున్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వెల్లడించే వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. దీక్ష విరమించాల్సిందిగా జైలు అధికారులు కోరినప్పుడు జగన్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. తాను ఎందుకు దీక్ష చేయాల్సి వచ్చిందో జైలు అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం.