నల్లమల జంగిల్ క్యాంప్ ప్రారంభం
Published Wed, Jan 25 2017 12:19 AM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
ఆత్మకూరు: అటవీశాఖ ఆధ్వర్యంలో బైర్లూటీ చెక్‌పోస్టు వద్ద రూ. 92లక్షలతో నిర్మించిన నల్లమల జంగిల్ క్యాంప్‌ను ఈ నెల 29న ప్రారంభిస్తున్నట్లు బైర్లూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నల్లమల జంగిల్ క్యాంప్ నల్లమలను వీక్షించాలనే పర్యాటకులకు ఎంతో అనువుగా ఉంటుందన్నారు. 1.34 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు మార్నింగ్ వాక్ ఉంటుందని, సిద్దాపురం చెరువు వరకు లేదా గంగిరేవు వాగు వరకు ఈ నడక ఉంటుందన్నారు. పర్యాటకులకు కాటేజీ, భోజన సదుపాయం కలి్పస్తున్నామన్నారు. ఈ క్యాంప్ ప్రారంభం సందర్భంగా 28, 29 తేదీల్లో బైర్లూటీ వద్ద ఆర్చరీ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నల్లమల జంగిల్ క్యాంప్‌ను ప్రారంభించేందుకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రానున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement