మహబూబ్‌నగర్: గద్వాల్ పట్టణంలో ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. సదురు బాధితురాలిని చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లమనగా ఆమె నిరాకరించి గద్వాల్‌లోనే ఉంటోంది. అధికారులు శనివారం బాధితురాలి ఇంటికి వెళ్లి చూడగా ఆమె భర్త, కుమారుడు కూడా జ్వరంతో బాధపడుతు కనిపించారు. వారికి కూడా స్వైన్‌ఫ్లూ సోకి ఉండవచ్చేమోనని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
(గద్వాల్)
చికిత్సకు నిరాకరించిన స్వైన్‌ఫ్లూ బాధితురాలు
Published Sat, Feb 14 2015 5:53 PM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement
Advertisement