ఇంటిప్స్
దుమ్ముకొట్టుకుపోయిన ఉడెన్ ఫర్నీచర్‌ను శుభ్రపరచాలంటే అమ్మోనియా ద్రావకం కలిపిన నీటిని మెత్తని క్లాత్‌తో అద్దుకొని, తుడవాలి.
నాన్‌జెల్ టూత్‌పేస్ట్, బేకింగ్ సొడా రాసి తడి క్లాత్‌తో రబ్ చేస్తే ఉడెన్ ఫర్నీచర్ పై మరకలు తొలగిపోతాయి. మరకలపై వంట నూనె, ఉప్పు రాసి పదిహేను నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో రబ్ చేసినా ఫర్నీచర్ పాలిష్‌చేసినట్టు కొత్తగా మెరుస్తుంది.
ఒక చిన్న గిన్నెలో కాఫీ పొడిని వేసి టేబుల్, అల్మారా సొరుగులు, కబోర్డ్స్ లోపల ఒక రాత్రంతా ఉంచితే, దుర్వాసన తగ్గుతుంది.యాంటిక్ ఫర్నీచర్ మీద మరకలు, దుమ్ము పోవాలంటే ముందుగా హెయిర్ డ్రయ్యర్‌ని ఉపయోగించాలి. డస్ట్ అంతా పోయిన తర్వాత నాన్‌జెల్ టూత్‌పేస్ట్‌ను రాసి, తడి క్లాత్‌తో తుడవాలి.