వస్త్ర వ్యాపారం బంద్
వస్త్ర వ్యాపారం బంద్
Published Tue, Jun 27 2017 11:13 PM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM
నిలిచిన రూ.5 కోట్ల మేర వ్యాపారం
మరో మూడు రోజుల పాటు మూత
రాజమహేంద్రవరం సిటీ : వస్తు,సేవల పన్ను చట్టం నుంచి వస్త్ర వ్యాపారాన్ని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హోల్‌సేల్, రిటైల్ వస్త్ర వ్యాపారులు చేపట్టిన నాలుగు రోజుల బంద్ మంగళవారం ప్రారంభమైంది. వస్త్ర వ్యాపారంలో వస్తుసేవల పన్ను కలవడం వలన సామాన్యులు సైతం ఇబ్బంది పడే పరిస్ధితి ఏర్పడుతుందని తద్వారా వ్యాపారులపై అ«ధికారులు వత్తిడి లంచగొండి తనం ఎక్కువైపోతుందని వ్యాపార వర్గాలు వాపోతున్నాయి. నగరంలో మహాత్మాగాంధీ హోల్ సేల్ మార్కెట్‌లో 600 షాపులు, మెయిన్‌రోడ్‌లు 15 పెద్దషోరూమ్‌లు, మిగిలిన షాపులు వెరసి సుమారు 700 షాపుల వరకూ వస్త్ర వ్యాపారం సాగిస్తున్నాయి. జీఎస్‌టీ ప్రమేయాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన నాలుగురోజుల పాటు వస్త్ర వ్యాపారాన్ని నిలుపుదల చేస్తూ బంద్ పాటించేందుకు సిద్ధమయ్యాయి. ఈ బంద్‌తో మొదటి రోజు రూ.5 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు స్తంభించాయని వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో రూ.20 కోట్ల మేర వ్యాపార లావాదేవీలకు అవాంతరం ఏర్పడనుందని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీ వస్త్ర సమాఖ్య ఉపాధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపారంలో జీఎస్‌టీ ప్రవేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేంది లేదన్నారు. జీఎస్‌టీతో వస్త్ర వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వస్త్ర వ్యాపారులు పన్నులకు వ్యతిరేకం కాదని, కేవలం జీఎస్‌టీ ప్రవేశాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు 30వ తేదీ వరకూ వ్యాపారాలు బంద్ పాటిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందన లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు వస్త్ర హోల్‌సేల్ వర్తకుల సంఘం అధ్యక్షులు బిళ్లా రాజు పేర్కోన్నారు. ఈ బంద్‌లో పలు వస్త్ర వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారులు స్థానిక మహాత్మాగాంధీ హోల్‌సేల్ క్లాత్ కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్డు వరకూ ర్యాలీ నిర్వహించారు.
Advertisement
Advertisement